‘సిగ్మా’పై నెగెటివ్‌ ప్రచారం చేస్తున్నదెవరో నాకు తెలుసు : సందీప్‌ సంచలన ట్వీట్‌ | Sundeep Kishan Warning To Negative Tweets About Sigma Movie | Sakshi
Sakshi News home page

‘సిగ్మా’పై నెగెటివ్‌ ప్రచారం చేస్తున్నదెవరో నాకు తెలుసు : సందీప్‌ సంచలన ట్వీట్‌

Oct 1 2026 7:00 PM | Updated on Oct 1 2026 7:13 PM

Sundeep Kishan Warning To Negative Tweets About Sigma Movie

కొంతమంది కావాలనీ తన సినిమాపై నెగెటివ్‌ ప్రచారం చేస్తున్నారని హీరో సందీప్‌ కిషన్‌  ఆరోపించారు. ఇది ఇలానే కొనసాగితే కచ్చితంగా భారీ మూల్యం చెల్లించుకుంటారని హెచ్చిరించాడు. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌  తనయుడు జాసన్‌ సంజయ్‌  దర్శకత్వంలో సందీప్‌  కిషన్‌ హీరోగా నటించిన తాజా చిత్రం ‘సిగ్మా’. ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం అక్టోబర్‌ 2న విడుదల కానుది. ఈ నేపథ్యంలో గత రెండు రోజులుగా ఈ సినిమాపై సోషల్‌ మీడియాలో విపరీతమైన నెగెటివ్‌  ప్రచారం జరుగుతోంది. అయితే విడుదలకు ముందే ఇలా నెగెటివ్‌ పోస్టులు వేయడం పట్ల సందీప్‌ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. దీని వెనుక ఎవరు ఉన్నారో తనకు తెలుసుని.. ఇది ఇలాగే కొనసాగితే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చిరించాడు.

(ఇదీ చదవండి: ఓటీటీల్లో ఒక్క రోజే 12 చిత్రాలు.. ఆ రెండు డోంట్‌ మిస్..!)

‘గత కొన్ని రోజులుగా నన్ను, నా కొత్త సినిమాను టార్గెట్‌ చేస్తూ నెగెటివ్‌ పోస్టులు పెడుతున్నారు. దీని వెనుక ఉన్నదెవరో నాకు తెలుసు. ఎవరెవరు డబ్బులు ఇచ్చారో కూడా తెలుసు.  ఇది ఇలానే కంటిన్యూ చేస్తే తగిన మూల్యం చెల్లించుకుంటారు. మీకో విషయం గుర్తు చేస్తున్నా.. నాకంటే మీరే ఎక్కువ నష్టపోతారు. డైరెక్ట్‌ అయిపోతే అందరూ దొరికిపోతారు మరి.. చూసుకోండి’ అని సందీప్‌  ట్వీట్‌ చేశడు.లైకా ప్రొడక్షన్స్‌ పతాకంపై సుభాస్కరన్‌ నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగులో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్‌ లిమిటెడ్, ఎన్‌.వి.ఆర్‌ సినిమా సంస్థలు విడుదల చేస్తున్నాయి. ఇటీవల హైదరాబాద్‌లో ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించగా.. చిరంజీవి ముఖ్య అతిథిగా వచ్చి చిత్రబృందాన్ని అభినందించారు. ఈ వారం రిలీజ్‌ అవుతున్న చిత్రాల్లో సిగ్మాపై తమిళంతో పాటు తెలుగులోనూ మంచి అంచనాలే ఉన్నాయి. 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement