షూటింగ్‌లో జారిపడ్డ అమితాబ్‌.. 84 ఏళ్ల వయసులో గాయం.. | Amitabh Bachchan Says Falls During KBC Shoot Injures His Knee | Sakshi
Sakshi News home page

Amitabh Bachchan: 84 ఏళ్ల వయసులో అమితాబ్‌ మోకాలికి గాయం..

Oct 1 2026 10:56 AM | Updated on Oct 1 2026 11:11 AM

Amitabh Bachchan Says Falls During KBC Shoot Injures His Knee

బాలీవుడ్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ ‘కౌన్‌ బనేగా కరోడ్‌పతి’ (కేబీసీ )షూటింగ్‌లో గాయపడ్డారు. ప్రస్తుతం ఈ కార్యక్రమం 18వ సీజన్‌ కొనసాగుతోంది. తాజాగా జరిగిన షూటింగ్‌లో తాను జారి పడటంతో మోకాలికి గాయమైందని బిగ్‌బీ వెల్లడించారు. దీంతో ఎప్పటిలా నిల్చొని కాకుండా ఈ సారి కూర్చొనే కార్యక్రమాన్ని ప్రారంభించారు.

నిలబడటం ఇబ్బందిగా ఉందని..
సాధారణంగా కేబీసీ ప్రారంభంలో వేదిక మధ్యలో నిల్చొని పోటీదారులను అమితాబ్‌ బచ్చన్‌ ఆహ్వానించేవారు. అయితే మోకాలికి గాయం కావడంతో నిలబడటంలో కొంత ఇబ్బంది ఎదురవుతోందని ఈ సందర్భంగా ప్రేక్షకులకు వివరించారు. పోటీదారులను ఆహ్వానించే సమయంలో మాత్రం తన సీటు వద్దే నిలబడతానని చెప్పారు. ప్రారంభంలో కంటెస్టెంట్‌ల వద్దకు వెళ్లి నిలబడటం మాత్రం కాస్త ఇబ్బందిగా ఉందని తెలిపారు.

అయితే తన గాయం గురించి అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అమితాబ్‌ భరోసా ఇచ్చారు. కాగా ఆయన గాయం గురించి తెలుసుకున్న అభిమానులు త్వరగా కోలుకోవాలని సామాజిక మాధ్యమాల వేదికగా ఆకాంక్షిస్తున్నారు.

83 ఏళ్ల వయసులోనూ..
83 ఏళ్ల వయసులోనూ అమితాబ్‌ బచ్చన్‌ వరుసగా సినిమాలు, టీవీ కార్యక్రమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇటీవల ‘సెక్షన్‌ 84’లో కనిపించిన ఆయన.. ప్రస్తుతం నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కల్కి’ సీక్వెల్‌తో బిజీగా ఉన్నారు. ఈ చిత్ర షూటింగ్‌ను వచ్చే ఏడాది జూన్‌ నాటికి పూర్తి చేయనున్నట్లు సమాచారం.

ఇదీ చదవండి: అశ్లీల సీన్స్‌.. ఇప్పుడైతే అలాంటి వాటిలో నటించను: అమలాపాల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement