సరికొత్త ఓటీటీ ఫ్లాట్‌ఫామ్.. ఉచితంగానే మలయాళ థ్రిల్లర్‌ మూవీస్..! | Three Malayalam blockbuster movies coming to Theater Plus OTT this week | Sakshi
Sakshi News home page

Theater Plus OTT: సరికొత్త ఓటీటీ ఫ్లాట్‌ఫామ్.. ఉచితంగానే మూడు సినిమాలు స్ట్రీమింగ్..!

Sep 30 2026 6:02 PM | Updated on Sep 30 2026 6:07 PM

Three Malayalam blockbuster movies coming to Theater Plus OTT this week

ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో పోటీ పెరిగిపోతోంది. కొత్తగా వచ్చిన థియేటర్‌ ప్లస్ ఫ్లాట్‌ఫామ్‌ ఆడియెన్సకు సరికొత్త ఎక్స్‌పీరియన్స్ అందిస్తోంది. డిఫరెంట్ కంటెంట్, భిన్న సినిమాల్ని ప్రేక్షకులకు అందిస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది. ఎలాంటి సబ్‌స్క్రిప్షన్ ఫీజు లేకుండానే ఉచితంగానే ఈ వారమే స్ట్రీమింగ్ చేస్తోంది.  మూడు డిఫరెంట్ జానర్స్‌లో వచ్చిన గుమాస్తా, 4 వసంతాలు, జై గణేష్ చిత్రాలు ఈ వారమే ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లోకి రాబోతోన్నాయి.

గుమాస్తా కథేంటంటే..

గుమాస్తా చిత్రం న్యాయ వ్వవస్థ, అందులోని లోపాల చుట్టూ తిరుగుతుంది. చట్టంలోని లూప్ హోల్స్ తెలిసిన లాయర్ క్లర్క్ అతని భార్య అనుమానాస్పద మృతిలో ప్రధాన ముద్దాయిగా ఉంటాడు. పిల్లిఎలుకలా సాగే ఈ ఆటలో చివరకు ఏం జరుగుతుందనేది ఎంతో ఇంట్రెస్టింగ్‌గా మారుతుంది. చివరకు వెళ్లే సరికి ట్విస్ట్‌ల మీద ట్విస్టులు వస్తుంటాయి. అలా క్లైమాక్స్‌కి అందరూ ఆశ్చర్యపోతారు.

నాలుగు వసంతాలు కథేంటంటే..

‘నాలుగు వసంతాలు‘ ఓ అందమైన ప్రేమ కథను ప్రేక్షకులకు అందిస్తుంది. నాలుగేళ్ల కాలేజ్ జర్నీలో ఓ ప్రేమ కథ, బ్రేకప్ వంటి అంశాల్ని ఎంతో అందంగా చూపిస్తారు. కాలేజ్‌ నుంచి బయటకు వెళ్లే టైంకి వీరి ప్రేమ కథలో ఎలాంటి ట్విస్ట్ అండ్ టర్న్స్ వస్తాయన్నది ఈ కథాంశం.

జై గణేశ్ కథేంటంటే..

‘జై గణేష్’ మూవీ ఓ చిన్న పిల్లాడి కిడ్నాప్ చుట్టూ తిరుగుతుంది. ఇందులోని ఇన్వెస్టిగేషన్ అందరినీ సీటు అంచున కూర్చోపెడుతుంది. చివరకు వచ్చే ట్విస్ట్‌లు, నేరస్థుడ్ని పట్టుకునే తీరు అద్భుతంగా ఉంటుంది. ఇలా ఈ మూడు డిఫరెంట్ చిత్రాలతో ఈ వారం థియేటర్‌ ప్లస్ ఓటీటీలో సందడి చేయనున్నాయి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement