కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కి పెద్ద షాక్ | All India Film Federation Non Cooperation Jani Master | Sakshi
Sakshi News home page

Jani Master: జానీ మాస్టర్ సస్పెండ్.. భార్య విశ్వప్రయత్నాలు

Sep 30 2026 2:11 PM | Updated on Sep 30 2026 2:17 PM

All India Film Federation Non Cooperation Jani Master

టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కి షాక్ తగిలింది. భారతదేశంలో సినీ & టీవి రంగాలలో పనిచేస్తున్న అన్ని ఫెడరేషన్‌ల వాళ్లు ఇతడికి సహాయ నిరాకరణ చేస్తున్నట్టు అల్ ఇండియా ఫిల్మ్ ఎంప్లాయీస్ కాన్ఫెడరేషన్ ప్రకటించింది. ఫెడరేషన్ నిర్ణయాలపై జానీ మాస్టర్.. కక్షపూరితంగా వ్యవహరిస్తునందున అన్ని ఫెడరేషన్ నాయకులతోనూ చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారు.  

(ఇదీ చదవండి: వరదల్లో కొట్టుకుపోయిన 'ఇరుముడి' బ్రిడ్జి)

మరోవైపు తన భర్త జానీ మాస్టర్‌పై విధించిన సస్పెన్సన్ వెంటనే ఎత్తివేయాలని సుమలత కోరారు. ఈ మేరకు ఫిలిం ఛాంబర్‌ని సంప్రదించారు. 30 ఏళ్ల తర్వాత ఒక మహిళ ప్రెసిడెంట్ కావడాన్ని తట్టుకోలేకపోతున్నారు. డ్యాన్సర్స్ యూనియన్‌లో అవినీతి జరుగుతోంది. అవినీతిపై ప్రశ్నిస్తే అసోసియేషన్ లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు. చిత్రపురి హౌసింగ్ సొసైటీలో అక్రమాలు జరుగుతున్నాయి. ఫెడరేషన్ పేరు చెప్పుకుని యూనియన్లని బెదిరించే ప్రయత్నాలు చేస్తున్నారని ఈమె ఆరోపణలు చేశారు. 

ఫిలిం ఫెడరేషన్ అధ్యక్షుడు పలమనేని అనిల్‌ని వెంటనే సస్పెండ్ చేయాలి. అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. మరోవైపు బుధవారం.. హైదరాబాద్ ఫిలిం ఛాంబర్‌‌లో సినీ కార్మికులు, పలు సంఘాల సమావేశమయ్యారు. ఇందులో చిత్రపురి సాధన సమితి, ఓయూ జేఏసీ, తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ, తదితర సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

(ఇదీ చదవండి: వయసెంతో చెప్పి షాకిచ్చిన తెలుగు సీరియల్ నటి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement