బ్రేకప్ చెప్పేసుకున్న బిగ్‌బాస్ తెలుగు జంట | Bigg Boss 9 Telugu Fame Demon Pavan And Rithu Chowdary Breakup Telugu News, Emotional Post Viral On Social Media | Sakshi
Sakshi News home page

Demon Pavan Rithu Breakup: ఎవరూ ఎవరినీ వాడుకోలేదు.. పవన్ ఎమోషనల్

Sep 30 2026 9:06 AM | Updated on Sep 30 2026 9:15 AM

Bigg Boss 9 Telugu Fame Demon Pavan Rithu Breakup

తెలుగులో ప్రస్తుతం బిగ్‌బాస్ 10వ సీజన్ నడుస్తోంది. అయితే గతేడాది అగ్నిపరీక్ష నుంచి ఈ షోకి వెళ్లి ఫైనల్ వరకు వచ్చిన డిమోన్ పవన్.. రీతూ చౌదరికి బ్రేకప్ చెప్పేశాడు. ఈ మేరకు తన ఇన్ స్టాలో ఎమోషనల్ స్టోరీ పోస్ట్ చేశాడు. తాము విడిపోయామని, ఇకపై తమ బంధం కొనసాగదని రాసుకొచ్చాడు.

'అందరికీ నమస్కారం. #రివాన్ గురించి నాకు వరుసగా మెసేజ్‌లు వస్తున్నాయి. అందుకే దీనిపై మాట్లాడాలని అనుకున్నాను. రీతుని నేను ఉపయోగించుకున్నాను. లేదా రీతు నన్ను ఉపయోగించుకుంది. ఇంకేదో జరిగింది అంటూ వస్తున్న నెగెటివిటీ, పుకార్లతో నేను విసిగిపోయాను. బిగ్‌బాస్‌లో మీరంతా చూసేది, నిజ జీవితంలో జరిగేది ఈ రెండూ పూర్తిగా వేర్వేరు విషయాలు. ఎవరూ ఎవరినీ ఉపయోగించుకోలేదు. ఇది ఒక పరస్పర స్నేహం. మా ఇద్దరికీ వ్యక్తిగత బలాలు, బలహీనతలు ఉన్నాయి. మేం గతంలో కలిసి పనిచేశాం. కానీ ఇకపై రివాన్(రీతూ-పవన్) ఉండదు'

'మా స్నేహం పూర్తిగా బ్రేకప్ అయిపోయింది. మేం మంచి రిలేషన్ మెంటైన్ చేశాం కానీ ఏ బంధంలోనైనా వ్యక్తిగత సమస్యలు ఉంటాయి. చాలా నెలలుగా మాకు ఎన్నోసార్లు గొడవలు జరిగాయి. ప్రతిసారీ నేను అర్థం చేసుకుని, సమస్యని పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాను. కానీ పరిస్థితులు అదుపు తప్పుతున్నాయి. ప్రతిసారీ మా గొడవలు మరింత పెద్దవవుతున్నాయి. కాబట్టి ప్రశాంతత కోసం మా ప్రాజెక్టులను విడివిడిగా చేసుకోవాలని అనుకున్నాం. ఆమె నన్ను వాట్సాప్‌లో బ్లాక్ చేసి, స్నాప్‌లో తొలగించింది. అది నాకు నచ్చలేదు. అందుకే నేను ఆమెని ఇన్‌స్టాగ్రామ్‌లో అన్ ఫాలో చేశాను. ఇప్పుడు ఆమె నన్ను ఇన్‌స్టాలోనూ బ్లాక్ చేసింది. నేను ఏ పోస్టులను డిలీట్ చేయలేదు. మీ సపోర్ట్‌కి థ్యాంక్యూ' అని పవన్ భావోద్వేగానికి గురయ్యాడు.

బిగ్‌బాస్ షోలో తెగ కెమిస్ట్రీ చూపించిన పవన్-రీతూ.. బయటకొచ్చిన తర్వాత 'బీబీ జోడీ' డ్యాన్స్ షోలో జంటగా పాల్గొన్నారు. గత నెలలోనే వీళ్లిద్దరూ కలిసి చేసిన 'బంగారం' అనే ఆల్బమ్ వీడియో సాంగ్ రిలీజైంది. ఇంతలో ఇప్పుడు బ్రేకప్ చెప్పేసుకోవడంతో వీళ్లిద్దరి అభిమానులు షాకయ్యారు. రీతూ చౌదరి ఈ విషయమై స్పందించాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement