నాని హీరోగా సుజిత్ దర్శకత్వంలో రూపొందనున్న యాక్షన్ థ్రిల్లర్ సినిమా ‘బ్లడీ రోమియో’. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. కాగా, ఈ సినిమాలోని హీరోయిన్ పాత్రను మీనాక్షీ చౌదరి చేయనున్నారనే టాక్ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది.
అలాగే మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ మరో లీడ్ రోల్ చేయనున్నారట. అక్టోబరు చివర్లో లండన్‌లో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం అవుతుందని, ఫుడ్ మాఫియా నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో గ్యాంగ్‌స్టర్‌గా నాని కనిపిస్తారని తెలిసింది. వెంక ట్ బోయనపల్లి నిర్మించనున్న ఈ సినిమా వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ కానుందని టాక్.


