మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కాకా మూవీతో బిజీగా ఉన్నారు. కొల్లి బాబీ డైరెక్షన్‌లో వస్తోన్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. అందులో భాగంగానే ఈ మూవీ షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఇటీవలే డబ్బింగ్ పనులు కూడా ప్రారంభమైనట్లు మేకర్స్ వెల్లడించారు. పక్కా సంక్రాంతికి రిలీజ్ చేసేలా మేకర్స్ దూసుకెళ్తున్నారు.
ఇదిలా ఉండగానే చిరంజీవికి సంబంధించిన లేటేస్ట్ టాక్ టాలీవుడ్‌లో వైరల్‌గా మారింది. ఆయన సెలబ్రిటీ టాక్ షోకు హోస్ట్‌గా చేయనున్నారని వార్త వినిపిస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో ఈ షో ప్రసారం కానుందని ప్రచారం జరుగుతోంది. దీంతో మెగాస్టార్ పారితోషికం ఎంతనే విషయంపై అప్పుడే టాలీవుడ్‌లో చర్చ మొదలైంది. ఈ టాక్ షోకు చిరంజీవి ఎంత తీసుకుంటున్నారనే విషయంలో క్రేజీ న్యూస్ వైరలవుతోంది.
ఈ డీల్‌ను మెగా డాటర్ సుస్మిత కొణిదెల చూసుకుంటున్నారని లేటేస్ట్ టాక్ వినిపిస్తోంది. మెగాస్టార్ హోస్ట్‌గా చేసేందుకు ఏకంగా రూ.200 కోట్ల వరకు ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ షో విషయంలో ఎలాంటి అధికారిక ప్రకటనైతే రాలేదు. రాబోయే రోజుల్లో దీనిపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.


