వెంకటేశ్ హీరోగా నటించిన లేటేస్ట్ మూవీ ఆదర్శ కుటుంబం (ఏకే47). ఈ చిత్రానికి త్రివిక్రమ్ దర్శకత్వం వహించారు. గాంధీ జయంతికి రిలీజ్ కావాల్సిన ఈ మూవీ వాయిదా వేశారు. వచ్చేనెల 9న థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, నారాయణమ్మ సాంగ్ మంచి హైప్‌ని క్రియేట్ చేశారు. దీనిలో భాగంగానే మూవీ ప్రమోషన్స్ కూడా ఇప్పటికే మొదలు పెట్టేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్ త్రివిక్రమ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
మీ తండ్రి ఎలా ప్రవర్తించేవారు?
యాంకర్ సుమ చదువు విషయంలో తండ్రి ఎలా ప్రవర్తించేవారు అని వెంకటేశ్‌కు అడిగిన ప్రశ్నకు త్రివిక్రమ్ బదులిస్తూ..‘ మా నాన్న గోడకేసి కొట్టేసేవారు. బహుశా ఇలా వెంకటేశ్‌కి జరగలేదేమో. మా నాన్న ఇవతల రూంలో కొడితే నేను అవతల రూంలో పడేవాడిని. అప్పట్లో ఆయన ఫుట్‌బాల్ ఆడుంటే ఇండియాకి మంచి పేరు వచ్చేదేమో’ అని చెప్తూ నవ్వులు పూయించారు. అంతేకాకుండా ఎన్టీఆర్‌తో తరువాత సినిమాపై అప్‌డేట్ అడగ్గా కచ్చితంగా ఉంటుందని.. ఇప్పటికే కథ రెడీ చేసినట్లు త్రివిక్రమ్ వెల్లడించారు.
ఇదీ చదవండి: మహేశ్‌బాబు, కృష్ణ కలిసి ఫైట్ చేస్తే ఎలా ఉంటుదో తెలుసా..?
#AK47 మా నాన్న గోడకేసి కొట్టేసేవారు...ఫుట్ బాల్ ఆడేసావారు
-త్రివిక్రమ్ శ్రీనివాస్ pic.twitter.com/dtD9K4Zh84— devipriya (@sairaaj44) September 29, 2026


