ఆయన పక్కనుంటే చాలా విషయాలు నేర్చుకోవచ్చు | Raashi Khanna Shares Experience With Rajinikanth | Sakshi
Sakshi News home page

Raashi Khanna: చాలా డౌట్స్.. ఆయన్ని అడిగి తెలుసుకున్నా

Sep 30 2026 8:29 AM | Updated on Sep 30 2026 8:29 AM

Raashi Khanna Shares Experience With Rajinikanth

దక్షిణాదిలో హీరోయిన్‌‌గా గుర్తింపు తెచ్చుకున్న రాశీఖన్నా.. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటిస్తూ కాస్తంత బిజీగానే ఉంది. ప్రస్తుతం రజనీకాంత్‌ హీరోగా చేస్తున్న 'ధర్మన్'లో కీలక పాత్ర చేస్తోంది. అశ్వత్ మారిముత్తు ఈ చిత్రానికి దర్శకుడు. కమలహాసన్‌ నిర్మాత. ప్రస్తుతం మైసూరులో ఈ ప్రాజెక్ట్ షూటింగ్ జరుగుతోంది.

అయితే రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాశీ ఖన్నా.. 'ధర్మన్‌' షూటింగ్ సంగతులు మాట్లాడింది. 'నా పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. రజనీకాంత్‌ నాకు మంచి ఫ్రెండ్‌ అయ్యారు. షూటింగ్‌ గ్యాప్‌లో చాలా విషయాల గురించి మాట్లాడుకుంటున్నాం. చాలా సందేహాలను ఆయన్ని అడిగి తెలుసుకున్నా. ఆయన చాలా ఓపిగ్గా బదులిస్తుంటారు. కొన్ని సమయాల్లో ఆట పట్టిస్తుంటారు. రజనీకాంత్‌లో హ్యుమర్ ఎక్కువ. ఆయన పక్కన ఉంటే చాలా విషయాలు నేర్చుకోవచ్చు' అని చెప్పుకొచ్చింది.

ఇందులో రజనీకాంత్ కూతురిగా రాశీఖన్నా నటిస్తున్నట్లు తెలుస్తోంది. తెలుగు హీరో రామ్ పోతినేని ఈమెకు జోడీగా విలనీ టచ్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నాడు. అనిరుధ్ సంగీత దర్శకుడు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ మూవీని థియేటర్లలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement