యాంకర్‌తో ప్రేమలో ఉన్న తమిళ హీరో.. ఫొటోలు వైరల్ | Tamil Actor Dinesh Confirms Relationship With Popular VJ Ezhilarasi, Couple Photos Went Viral On Social Media | Sakshi
Sakshi News home page

Tamil Actor Dinesh: ప్రేమబంధాన్ని బయటపెట్టేసిన ప్రముఖ నటుడు

Sep 29 2026 9:50 AM | Updated on Sep 29 2026 10:22 AM

Tamil Actor Dinesh In Love With Anchor Ezhilarasi

సినిమా ఇండస్ట్రీలో ప్రేమ, రిలేషన్, డేటింగ్ లాంటివి ఎప్పటికప్పుడు వినిపిస్తూనే ఉంటాయి. నటీనటుల మధ్య ప్రేమ పుట్టడం సాధారణమే. అందుకు తగ్గట్లే సమయం, సందర్భం చూసుకుని తమ బంధాన్ని బహిర్గతం చేస్తుంటారు. తాజాగా తమిళ హీరోతో తాను ప్రేమలో ఉన్నట్లు ఓ యాంకర్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. 'నా వాడు' అని ఇందులో సంభోధించింది. ఇప్పుడీ విషయం చర్చనీయాంశమైంది.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 23 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)

తమిళ సీరియల్స్‌తో నటుడిగా కెరీర్ మొదలుపెట్టిన దినేష్.. 2012లో వచ్చిన 'అట్టకత్తి' మూవీతో మంచి ఫేమ్ సంపాదించుకున్నాడు. తర్వాత కాలంలో నటుడిగా చేస్తూ హీరోగానూ అడపాదడపా కనిపిస్తూ వస్తున్నారు. రెండేళ్ల క్రితం వచ్చిన 'లబ్బర్ పందు' మూవీతో అద్భుతమైన సక్సెస్ అందుకుని ఓటీటీ డబ్బింగ్ రూపంలో తెలుగు ప్రేక్షకులకూ పరిచయమయ్యాడు.

ప్రస్తుతం పా.రంజిత్ దర్శకత్వంలో 'వెట్టువం' అనే మూవీలో ఓ హీరోగా దినేష్ చేస్తున్నాడు. ఇతడి పుట్టినరోజు సందర్భంగా తమిళ ప్రముఖ యాంకర్, వీజే ఎయిలరిసి.. దినేష్‌తో కలిసున్న ఫొటోలు పోస్ట్ చేసి తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించింది. చేతికి ఉంగరాలు ధరించిన ఫొటోని కూడా పోస్ట్ చేసింది. దీంతో ఈ జంటకు నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు. నటుడు దినేష్ ప్రస్తుత వయసు 42 ఏళ్లు. త్వరలోనే పెళ్లి చేసుకుని వీళ్లిద్దరూ శుభవార్త చెబుతారేమో చూడాలి?

(ఇదీ చదవండి: పెళ్లి తర్వాత జ్యోతిక నా కొడుకుని తీసుకెళ్లిపోయి ఉండొచ్చు కానీ: సూర్య తండ్రి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement