మరోవారం వచ్చేసింది. ఈసారి గాంధీ జయంతితో పాటు వీకెండ్ కలిసొచ్చింది. కానీ చెప్పుకోదగ్గ మూవీస్ థియేటర్లలోకి రావట్లేదు. ఉన్నంతలో రాజమౌళి కొడుకు కార్తికేయ నిర్మాతగా ఫహాద్ ఫాజిల్ హీరోగా చేసిన 'డోంట్ ట్రబుల్ ద ట్రబుల్' మూవీతో పాటు దళపతి విజయ్ కొడుకు జేసన్ దర్శకుడిగా తొలిసారి చేసిన 'సిగ్మా', తెల్ల కాగితం, అనకాపల్లి, ప్రేమనే ఊరిలో తదితర మూవీస్ ఈ వీకెండ్ బిగ్ స్క్రీన్స్‌పైకి రానున్నాయి.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి సందీప్ రెడ్డి వంగా కొత్త సినిమా.. అధికారిక ప్రకటన)

మరోవైపు ఓటీటీల్లోనూ 23 వరకు సినిమాలు, సిరీస్‌లు స్ట్రీమింగ్ కానున్నాయి. మమిత బైజు చేసిన సెన్సేషనల్ హిట్ 'బెత్లెహెమ్ కుడుంబ యూనిట్', #లవ్ సిరీస్, పూజా మేరీ జాన్, రోమాంచకం చిత్రాలు ఉన్నంతలో ఆసక్తికరంగా అనిపిస్తున్నాయి. వీటితోపాటు మరికొన్ని వీకెండ్ టైంలో సడన్ స్ట్రీమింగ్ అయ్యే అవకాశముంది. ఇంతకీ ఏ ఓటీటీలో ఏ మూవీ అందుబాటులోకి రానుందంటే?
ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (సెప్టెంబరు 27 నుంచి అక్టోబర్ 04 వరకు)
హాట్‌స్టార్
మైన్ లడేగా (హిందీ సిరీస్) - సెప్టెంబరు 30
బెత్లెహెమ్ కుడుంబ యూనిట్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - అక్టోబరు 02
మార్షల్స్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబరు 04
ట్రాకర్ సీజన్ 4 (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబరు 04
నెట్‌ఫ్లిక్స్
డెత్ ఆఫ్ ఏ యూనికార్న్ (ఇంగ్లీష్ సినిమా) - సెప్టెంబరు 28
ఇర్రెప్లేసబుల్ (చైనీస్ సిరీస్) - సెప్టెంబరు 28
డిమోన్ స్లేయర్: ఇన్ఫినిటీ కేజిల్ (జపనీస్ సిరీస్) - సెప్టెంబరు 28
ఐ పాప్-స్టార్స్ (హిందీ రియాలిటీ షో) - సెప్టెంబరు 29
లెగో వన్ పీస్ (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 29
ద ఎరీనా (ఫ్రెంచ్ సిరీస్) - సెప్టెంబరు 30
మెదుశా సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 30
రోమాంచకం (తెలుగు సినిమా) - అక్టోబరు 01
ఈస్ట్ ఆఫ్ ఈడెన్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబరు 01
ఓ మై డాగ్ (హిందీ సినిమా) - అక్టోబరు 01
#లవ్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - అక్టోబరు 02
డూయింగ్ లైఫ్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - అక్టోబరు 02
షూమాకర్ '94: ద బర్త్ ఆఫ్ ఏ లెజెండ్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబరు 02
అమెజాన్ ప్రైమ్
దుపాహియా సీజన్ 2 (హిందీ సిరీస్) - అక్టోబరు 01
జీ5
పంథడిక్కామ్ (మలయాళ సిరీస్) - అక్టోబరు 01
పూజా మేరీ జాన్ (హిందీ సినిమా) - అక్టోబరు 02
మదర్ ప్రామిస్ (కన్నడ చిత్రం) - అక్టోబరు 02
ఈవిల్ డెడ్ బర్న్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - అక్టోబరు 02
ఆపిల్ టీవీ ప్లస్
ద లాస్ట్ ఫస్ట్: వింటర్ కె2 (ఇంగ్లీష్ మూవీ) - అక్టోబరు 02
(ఇదీ చదవండి: నా భార్య కనిపించట్లేదు.. ఓటీటీ కోసం కలిసిన హిట్ జోడీ)


