తెలుగు యువ దర్శకుడి భార్య మృతి.. అవయవదానం | Director Pradeep Advaitham Wife No More And Organ Donation | Sakshi
Sakshi News home page

Pradeep Advaitham: దర్శకుడి ఇంట విషాదం.. భార్యకు కన్నీటి వీడ్కోలు

Sep 28 2026 8:13 AM | Updated on Sep 28 2026 8:13 AM

Director Pradeep Advaitham Wife No More And Organ Donation

తెలుగు సినీ దర్శకుడు ప్రదీప్ అద్వైతం ఇంట్లో విషాదం. ఇతడి భార్య దీప్తి రెడ్డి(42) చనిపోయారు. శనివారం బ్రెయిన్ స్ట్రోక్‌కి గురైన ఈమెని హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ ఈమె తుదిశ్వాస విడిచారు. దీంతో స్నేహితులు, పలువురు సినీ సన్నిహితులు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

'అద్వైతం' షార్ట్ ఫిల్మ్‌తో గుర్తింపు తెచ్చుకున్న ప్రదీప్.. బిల్లా రంగా, మైనే ప్యార్ కియా సినిమాలు తీశాడు. గతేడాది డిసెంబరు కాంత్ కొడుకు రోషన్ హీరోగా 'ఛాంపియన్' మూవీ తీశాడు. 'సేవ్ ది టైగర్స్' సిరీస్‌తోనూ కాస్త గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈమె భార్య దీప్తిరెడ్డి.. సామాజిక కార్యకర్త, యువ పారిశ్రామితవేత్తగా గుర్తింపు తెచ్చుకున్నారు.

ఇకపోతే దీప్తిరెడ్డి.. ఈ ఏడాది జూన్‌లో అవయవ దానానికి ప్రతిజ్ఞ చేశారు. ఇప్పుడు ఈమె చనిపోవడంతో కుటుంబ సభ్యులు అవయవ దానానికి సమ్మతించడంతో.. విరాట్ ఫౌండేషన్ సహకారంతో జీవన్ దాన్ ద్వారా అవసరమైన అధికారిక ప్రక్రియని వైద్యులు పూర్తిచేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement