నరేంద్ర కొండ, శ్రీ నందు, ఏఎం రత్నం, ఇందు కుమార్, హర్షవర్ధన్
– నిర్మాత ఏఎం రత్నం
శ్రీ నందు, ఇందుకుమార్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘కాసు’. పీఎస్ హర్షవర్ధన్ దర్శకత్వంలో ఇందుకుమార్, నరేంద్ర కొండ నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. ఈ సినిమా గ్లింప్స్ లాంచ్ ఈవెంట్‌కు అతిథిగా హాజరైన నిర్మాత ఏఎం రత్నం మాట్లాడుతూ– ‘‘సినిమా బాగా వచ్చిందని అనుకోకుండా బాగా వచ్చేదాకా చేయండి. మేకింగ్ విషయంలో రాజీ పడొద్దు.
నా తొలి సినిమా ‘కర్తవ్యం’ క్లైమాక్స్ నచ్చకపోతే, మళ్లీ రైటర్స్‌ను పట్టుకుని మార్పులు చేయించి, షూట్ చేశాం. ఆ సినిమా జాతీయ స్థాయిలో పెద్ద విజయం సాధించింది. నేను ఏ సినిమా చేసినా మొదటి చిత్రంలా భావించి నిర్మిస్తా. మీరూ అలానే చేయాలని సలహా ఇస్తున్నాను’’ అని చెప్పారు. ‘‘డబ్బు సంపాదన జబ్బు కింద మారితే ఏమౌతుంది? అన్నదే ఈ సినిమా కథాంశం’’ అని అన్నారు శ్రీ నందు.
‘‘హిల్ స్టేషన్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే లవ్‌స్టోరీ మూవీ ఇది’’ అని తెలిపారు పీఎస్ హర్షవర్ధన్. ‘‘ప్రేమలో ఉన్న ఒక జంట మధ్య డబ్బు విషయంలో దురాశ మొదలైతే వారి ప్రేమకు ఎలాంటి ఇబ్బందులు వస్తాయి? అనేది మా మూవీలో ఆసక్తికరంగా ఉంటుంది’’ అని చెప్పారు నరేంద్ర కొండ. ‘‘ఒక పల్లెటూరి నుంచి వచ్చిన అమ్మాయిని నేను. యాంకరింగ్‌తో మొదలుపెట్టి ఈ రోజు నిర్మాతగా, హీరోయిన్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చాను. ‘కాసు’ సినిమా ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకం ఉంది’’ అని చెప్పారు ఇందు కుమార్.


