ఆ రోజే నిజమైన డాటర్స్‌ డే | Kriti Sanon shared a powerful Daughters Day message | Sakshi
Sakshi News home page

ఆ రోజే నిజమైన డాటర్స్‌ డే

Sep 28 2026 1:23 AM | Updated on Sep 28 2026 1:23 AM

Kriti Sanon shared a powerful Daughters Day message

– కృతీ సనన్‌

‘‘ఆడవాళ్లకు నిజమైన స్వాతంత్య్రం అంటే నేను నమ్మేది ఏంటంటే... ఒక ఆడపిల్ల రాత్రి పూట ఒంటరిగా నడవగలిగిన రోజు, చీకటి పడ్డాక పార్కులో కూర్చోగలిగిన రోజు, తనకు నచ్చిన దుస్తులు ధరించగలిగిన రోజు, ఎలాంటి భయం లేకుండా పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఉపయోగించగలిగిన రోజు, అలానే పబ్లిక్‌ ప్లేస్‌లో ఉన్నప్పుడు ఎలాంటి ప్రమాదం పొంచి ఉందో అని ఆలోచించని రోజు... నిజమైన ‘డాటర్స్‌ డే’. 

ఆ రోజునే మనం నిజమైన డాటర్స్‌ డేని జరుపుకోవాలి’’ అని కృతీ సనన్‌ సోషల్‌ మీడియా వేదికగా పేర్కొన్నారు. ఆదివారం ‘డాటర్స్‌ డే’ని పురస్కరించుకుని ఆమె ఈ విధంగా అన్నారు. ఇంకా సమాజంలో ఆడపిల్లల భద్రత గురించి ఆమె షేర్‌ చేసుకున్న కొన్ని విషయాలు ఈ విధంగా... ‘‘మీ కూతురు మీకు ఫోన్‌ చేసి ‘నన్ను కొందరు పురుషులు వెంబడిస్తున్నట్లు అనిపిస్తోంది’ అని చెబుతున్నట్లు ఊహించుకోండి, రాత్రిపూట ఒంటరిగా నడుస్తూ, భయంతో వెనక్కి తిరిగి చూసుకోవడం... ఇంటికి చేరేలోపే మీ కూతురి ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ అయిపోవడం... ఇలాంటి పరిస్థితులను ఒక్కసారి ఊహించుకుని చూడండి... వీటి గురించి లోతుగా ఆలోచించండి. 

అప్పుడు మన ఆడపిల్ల భద్రత లేని సమాజంలో ఉన్న విషయం ఇంకా బాగా అర్థం అవుతుంది. ఆడపిల్ల ఇంటికి క్షేమంగా చేరిన తర్వాత కుటుంబ సభ్యులకు ‘నేను ఇంటికి వచ్చేశాను’ అని ఫోన్‌ చేసి చెప్పాల్సిన అవసరం లేని రోజు రావాలి. అలాంటి సురక్షితమైన ప్రపంచాన్ని కూతుళ్లుకు అందించాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఆడపిల్ల బయటకు వెళ్లినప్పుడు లైవ్‌ లొకేషన్‌ షేర్‌ చేయడం, పెప్పర్‌ స్ప్రే వెంట తీసుకెళ్లడం, నడవడానికి బదులుగా క్యాబ్‌ బుక్‌ చేసుకోవడం, కేవలం సేఫ్‌గా భావించడం కోసం ఎవరికైనా ఫోన్‌ చేయడం... ఇవన్నీ కూడా తన జీవనశైలిలో భాగం చేసుకునేలా మనమే ఆమెను బలవంతం చేశాం’’ అంటూ కృతీ సనన్‌ షేర్‌ చేసిన పోస్ట్‌ వైరల్‌గా మారింది. కృతి చెప్పినది అక్షరాలా నిజం అని కొందరు, ఆడపిల్లల భద్రత విషయంలో ప్రపంచం చాలా మారాలని కొందరు నెటిజన్లు స్పందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement