పెళ్లిపై మనసు విప్పిన అంజలి.. వాళ్ల సంతోషం కోసమే.. | Anjali Hilarious Reply to the Question When Are You Getting Married | Sakshi
Sakshi News home page

Anjali: పెళ్లిపై అంజలి సంచలన వ్యాఖ్యలు!

Sep 27 2026 9:01 PM | Updated on Sep 27 2026 9:15 PM

Anjali Hilarious Reply to the Question When Are You Getting Married

నటి అంజలి కోసం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమెకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అయితే అంజలీకి పెళ్లి గురించి ఎప్పుడూ ఏదో ఒక ప్రశ్న ఎదురవుతూనే ఉంటుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పెళ్లి ప్రస్తావన రావడంతో ఆమె తనదైన శైలిలో స్పందించారు. ప్రస్తుతం పెళ్లి చేసుకోవాలనే ఆలోచన తనకు లేదని అంజలి స్పష్టం చేశారు.

‘అది నా పెళ్లి. ఎప్పుడు అనిపిస్తే అప్పుడు చేసుకుంటా. పెళ్లి విషయంలో అంత తొందర ఎందుకు?’ అంటూ అంజలి ప్రశ్నించారు. తన స్నేహితులు పెళ్లి పేరుతో చేసే హడావుడిపై కూడా ఆమె ఫన్నీగా కామెంట్ చేశారు. ‘పెళ్లి కూతురి కంటే నా ఫ్రెండ్స్‌కే పెళ్లి వేడుకలంటే ఎక్కువ ఇష్టం. రెడీ అవ్వడం, ఫొటోషూట్లు చేయడం, సందడి చేయడం వాళ్లకు చాలా ఇష్టం. వాళ్లు ఎంజాయ్ చేయడానికి నేను పెళ్లి చేసుకోవాలా?’ అంటూ నవ్వుతూ అన్నారు.

మీరే పెళ్లి చేసుకోండి..
‘మీరే పెళ్లి చేసుకోండి.. నేను వచ్చి రెడీ అయి మీ ఫొటోషూట్‌లో పాల్గొంటా అని నా ఫ్రెండ్స్‌తో చెబుతుంటా. వాళ్ల సరదా, సంతోషం కోసం నేను ఇంకొకరిని పెళ్లి చేసుకోవడం ఎందుకు? ఆ విషయంలో మాత్రం వాళ్ల మాట వినను’ అని అంజలి సరదాగా అంటూ నవ్వులు పూయించారు. 
సినిమాల విషయానికి వస్తే.. ఇటీవలే విశాల్‌ నటించిన ‘మకుటం’లో కనిపించారు. రామ్ దర్శకత్వంలో సూరి​, నివిన్‌ పౌలీలు కీలక పాత్రలు పోషించిన ‘ఏళు కడల్ ఏళు మలై’(తెలుగులో సంచారి)లోనూ నటించారు. ఈ చిత్రం అక్టోబర్ 1న విడుదల కానుంది.
ఇదీ చదవండి: ‘మగధీర’కి లేని లాజిక్‌ ప్యారడైజ్‌కు ఎందుకు..?: డైరెక్టర్‌ శ్రీకాంత్‌ ఓదెల
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement