ఇంగ్లీష్‌లో అదరగొట్టిన సాయిపల్లవి.. ఫ్యాన్స్‌ ప్రశంసలు | Sai Pallavi Fluent English Speech at Ramayana Event Wins Praise from Fans | Sakshi
Sakshi News home page

Ramayana Movie: సాయి పల్లవి స్పీచ్‌కు ఫిదా.. ఫ్యాన్స్‌ ప్రశంసలు

Sep 27 2026 5:20 PM | Updated on Sep 27 2026 5:27 PM

Sai Pallavi Fluent English Speech at Ramayana Event Wins Praise from Fans

బాలీవుడ్‌ దర్శకుడు నితేశ్‌ తివారీ తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘రామాయణ.’ ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు  ఉన్నాయి. తాజాగా తెలుగులోనూ ట్రైలర్‌ని రిలీజ్‌ చేయగా..ఎంతగానో ఆకట్టుకుంటోంది. రణ్‌బీర్‌ కపూర్‌ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ప్రతి అప్‌డేట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారుతోంది. తాజాగా ముంబైలో సెప్టెంబర్ 26న రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి, దర్శకుడు నితేశ్ తివారీ,నిర్మాత నమిత్ మల్హోత్రాతో కలిసి మిస్టర్ బీస్ట్ ముంబైలో ఓ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ఈవెంట్‌లో సాయి పల్లవి పాల్గొని మాట్లాడారు. ఇప్పుడీ కామెంట్స్‌ వైరల్‌ అవ్వడంతో పాటు సాయిపల్లవిపై ప్రశంసలు కురుస్తున్నాయి.

 ‘జై శ్రీరామ్‌’ అంటూ..
‘ఈ రోజు ఇక్కడికి వచ్చి మాతో ఇంత అద్భుతమైన ఎనర్జీని పంచుకున్నందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్‌. మేము ఇంతకాలం పడిన కష్టాలను, ఎన్నో విషయాలను  ఈ సినిమాతో చూపిస్తాం. మీ అందరికీ గొప్ప అనుభూతి కలగుతుంది.’ అని అన్నారు. అంతేకాకుండా ఇంతకాలం ‘రామాయణ’ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు కూడా ఆమె ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ‘మా కోసం ఇంతకాలం ఎదురుచూస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. మీతో ఈ క్షణాలను పంచుకోవాలని మేము కూడా ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నాం. ఇంత ఓపికగా, ప్రేమగా మమ్మల్ని ఆదరిస్తున్నందుకు థ్యాంక్యూ’ అంటూ సాయి పల్లవి చెప్పుకొచ్చారు. చివర్లో ‘జై శ్రీరామ్‌’ అంటూ తన స్పీచ్‌ను ముగించారు.

అనర్గళంగా ఇంగ్లీష్‌లో..
అయితే ఈ స్పీచ్‌లో సాయి పల్లవి అనర్గళంగా ఇంగ్లీష్‌లో మాట్లాడటం ఇప్పుడు సోషల్‌ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఎలాంటి తడబాటు లేకుండా ఫుల్‌ ఫ్లోలో ఆమె మాట్లాడిన తీరుపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ముఖ్యంగా తెలుగు హీరోయిన్‌ అయిన సాయి పల్లవి ఇంత ఫ్లూయెంట్‌గా ఇంగ్లీష్‌ మాట్లాడటంపై ఫ్యాన్స్‌ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె స్పీచ్‌కు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 
ఇదీ చదవండి: ‘నరేశ్‌.. రాంప్రసాద్‌తో జాగ్రత్త.. లేదంటే నీ పని అంతే..!’
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement