ఇంతవరకు విమానం ఎక్కని స్టార్‌ విలన్‌.. కారణం ఇదే! | Sampath Raj Fear of Flying Never Travelled By Flight | Sakshi
Sakshi News home page

తెరపై అందర్నీ భయపెట్టే ఈ విలన్‌.. బయట విమానం అంటే వణికిపోతాడు!

Sep 27 2026 3:34 PM | Updated on Sep 27 2026 4:18 PM

Sampath Raj Fear of Flying Never Travelled By Flight

సినిమాల్లో విలన్‌ అంటేనే భయంకరమైన రూపం.. భారీ యాక్షన్‌ సీన్లు.. హీరోతో హోరాహోరీ పోరాటాలు గుర్తుకొస్తాయి. తెరపై కత్తులు, తుపాకులతో విరుచుకుపడే విలన్లు నిజ జీవితంలోనూ అంతే ధైర్యంగా ఉంటారనుకుంటే మాత్రం పొరపాటే. ఎందుకంటే కెమెరా ముందు రఫ్‌ అండ్‌ టఫ్‌గా కనిపించే కొందరు నటీనటులకు వ్యక్తిగత జీవితంలో కొన్ని విషయాల్లో చాలా భయపడతారు. అలాంటి ఓ ఆసక్తికరమైన విషయాన్నే ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ చోటా కే. నాయుడు తాజాగా బయటపెట్టారు.

టాలీవుడ్‌లో విలన్‌ పాత్రలతో పాటు క్యారెక్టర్‌ రోల్స్‌తోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు సంపత్‌ రాజ్‌. తెరపై ఆయన కనిపిస్తేనే ప్రత్యర్థులకు దడ పుట్టేలా పాత్రలను పోషించారు. అయితే ఈ నటుడికి విమానం అంటే మాత్రం చాలా భయమట. ఇప్పటివరకు ఆయన విమానంలో ప్రయాణించలేదని చోటా కే. నాయుడు వెల్లడించారు.

ఇటీవల జరిగిన ‘సిగ్మా’ మూవీ ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌లో చోటా కే. నాయుడు ఈ ఆసక్తికర విషయాన్ని చెప్పాడు. సంపత్‌ రాజ్‌కు విమానం అంటే భయమని, అందుకే ఇప్పటివరకు విమానం ఎక్కలేదని ఆయన పేర్కొన్నారు. ఎంత దూరం వెళ్లాల్సి వచ్చినా విమానాన్ని ఎంచుకోకుండా రైలులోనే ప్రయాణిస్తారని చెప్పుకొచ్చారు.

చోటా కే. నాయుడు ఈ విషయాన్ని వేదికపై చెప్పడంతో అక్కడే ఉన్న సంపత్‌ రాజ్‌ గట్టిగా నవ్వేశారు. సినిమాల్లో మాత్రం ఎలాంటి భయం లేకుండా పవర్‌ఫుల్‌ విలన్‌ పాత్రల్లో కనిపించే సంపత్‌ రాజ్‌కు విమానం అంటే భయం అనే విషయం తెలియడంతో ఈ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement