‘ది ప్యారడైజ్‌’ డే3 కలెక్షన్స్‌.. టాక్‌ ఎలా ఉన్నా తగ్గేదేలే! | The Paradise Movie Box Office Collection Day 3 Details | Sakshi
Sakshi News home page

‘ది ప్యారడైజ్‌’ కలెక్షన్స్‌.. మూడో రోజు ఎంత వచ్చిందంటే?

Sep 27 2026 12:19 PM | Updated on Sep 27 2026 12:22 PM

The Paradise Movie Box Office Collection Day 3 Details

నాని, శ్రీకాంత్‌ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘ది ప్యారడైజ్‌’ బాక్సాఫీస్‌ వద్ద దూసుకెళ్తోంది. సినిమాకు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభించినప్పటికీ.. వసూళ్ల విషయంలో మాత్రం జోరు చూపిస్తోంది. భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 24న  విడుదలైన ఈ చిత్రం తొలి రోజు నుంచే మంచి కలెక్షన్లు రాబడుతూ.. రెండు రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టింది. ఇక మూడో రోజు కూడా మంచి వసూళ్లనే రాబట్టింది.

(చదవండి: తమ్ముడు శ్రీకాంత్.. మంచి సందేశమిచ్చావ్: కేటీఆర్‌ భావోద్వేగ ట్వీట్)

మేకర్స్‌ వెల్లడించిన వివరాల ప్రకారం.. ‘ది ప్యారడైజ్‌’ మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.136 కోట్ల గ్రాస్‌ వసూళ్లు సాధించింది. ఇందులో మూడో రోజు ఏకంగా రూ.22 కోట్ల గ్రాస్‌ వచ్చినట్లు చిత్రబృందం ప్రకటించింది. దీంతో విడుదలైన మూడు రోజుల్లోనే సినిమా రూ.136 కోట్ల మార్క్‌ను అందుకుంది.

నాని నటన, శ్రీకాంత్‌ ఓదెల టేకింగ్‌, అనిరుధ్‌ రవిచందర్‌ నేపథ్య సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణలుగా నిలిచాయి. అయితే కథ, కథనం విషయంలో కొంతమంది ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా భారీ అంచనాలతో థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకుల్లో కొందరు సినిమా విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ ఈ ప్రభావం బాక్సాఫీస్‌ వసూళ్లపై పెద్దగా కనిపించడం లేదు. ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందనతో పాటు వీకెండ్‌ అడ్వాంటేజ్‌తో సినిమా కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement