తమ్ముడు శ్రీకాంత్.. మంచి సందేశమిచ్చావ్: కేటీఆర్‌ భావోద్వేగ ట్వీట్ | Ktr Tweet On The Paradise Movie After Watching in Theatre | Sakshi
Sakshi News home page

KTR: తమ్ముడు శ్రీకాంత్.. మంచి సందేశమిచ్చావ్: కేటీఆర్‌ భావోద్వేగ ట్వీట్

Sep 27 2026 10:17 AM | Updated on Sep 27 2026 10:43 AM

Ktr Tweet On The Paradise Movie After Watching in Theatre

నాని హీరోగా వచ్చిన లేటేస్ట్ యాక్షన్‌ మూవీ ది ప్యారడైజ్‌. ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించారు. దసరా కాంబోలో వచ్చిన ఈ మూవీ.. అభిమానుల భారీ అంచనాల మధ్య సెప్టెంబర్‌ 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాకు తొలిరోజే మిక్స్‌డ్ టాక్‌ వచ్చింది. అయినప్పటికీ వసూళ్లుపరంగా బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఈ చిత్రం టాక్ ఎలా ఉన్నప్పటికీ.. కేసీఆర్, ఎన్టీఆర్‌ పాత్రలు ఆడియన్స్‌ను ఆకట్టుకున్నాయి.

ఈ మూవీలోని కేసీఆర్‌ రోల్‌ చూసేందుకు ఆయన అభిమానులు సైతం థియేటర్లకు క్యూ కడుతున్నారు. తాజాగా ఈ చిత్రాన్ని కేసీఆర్ తనయుడు, మాజీ మంత్రి కేటీఆర్ స్వయంగా థియేటర్‌కు వెళ్లి వీక్షించారు. సినిమా చూశాకా కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. ఈ సినిమా అస్తిత్వం కోసం ఆరాటం.. అణిచివేతపై పోరాటమని కొనియాడారు.  సందర్భం వస్తే గడ్డిపోచలు కూడా గడ్డపారలుగా మారుతాయనే సందేశాన్ని అందించిన తమ్ముడు శ్రీకాంత్ ఓదెలకి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. అలాగే కథానాయకుడి పాత్రలో జీవించిన మిత్రుడు నానికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు.. తమ్ముడు ప్రియదర్శి కి ప్రత్యేక అభినందనలు అంటూ ప్రశంసించారు. చావు నోట్లో తల పెట్టయినా…మీకు గుర్తింపు తెస్తా అంటూ సినిమాలోని కేసీఆర్‌ డైలాగ్‌ను రాసుకొచ్చారు. ఈ చిత్రాన్ని కేటీఆర్‌తో పాటు మాజీమంత్రులు జగదీశ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా వీక్షించారు. 
 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement