సాక్షి, చెన్నై: కోయంబత్తూరులో జరిగిన మాజీ పోలీస్ అధికారుల సంక్షేమ ట్రస్ట్ 10వ వార్షికోత్సవానికి హీరో కార్తీ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన కొత్త ప్రభుత్వం పోలీసులకు వారంలో ఒక రోజు సెలవు ఇస్తామని చెప్పిందని, అయితే ఆ హామీ కేవలం కాగితాలకే పరిమితమైందని కార్తీ విమర్శించారు. సినిమాల కోసం తాను పోలీసుల పనితీరుపై చాలా పరిశోధన చేశానని తెలిపారు. సమాజంలో పోలీసులపై కొన్నిసార్లు విమర్శలు రావచ్చునని, కానీ ఇప్పటికీ ఎంతోమంది నిజాయితీపరులైన అధికారులు ఉన్నందువల్లే ప్రజలందరూ ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నారని ప్రశంసించారు.
ఇదీ చదవండి: ఏసీబీ వలలో మెట్‌పల్లి సీడీపీఓ


