రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘జైలర్’. 2023లో విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. తాజాగా రజనీకాంత్–నెల్సన్ కాంబినేషన్‌లోనే ‘జైలర్’కు సీక్వెల్‌గా ‘జైలర్ 2’ తెరకెక్కింది. కళానిధి మారన్ నిర్మించిన ఈ చిత్రం అక్టోబరు 15న విడుదల కానుంది. శుక్రవారం ఈ సినిమా నుంచి ‘వన్ సన్... వన్ మూన్...’ అనే పాట లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్.
‘గుండెల్నే పరిపాలించే ప్రేమికుడేలే... మన దిక్కు మొక్కైపోడ కావాలంటే...., వన్ సన్... వన్ మూన్ అండ్ వన్’ అంటూ ఈ పాట సాగుతుంది. హైసెన్ బర్గ్, భాస్కరభట్ల ఈ పాటకు సాహిత్యం అందించగా ఎస్‌ఎస్ కృష్ణ, ఇన్నోగెంగాలతో కలిసి ఈ చిత్రసంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ ఈ పాటను పాడారు. ఎస్‌జే సూర్య, విద్యా బాలన్, హృతిక్ రోషన్, రమ్యకృష్ణ, యోగిబాబు, మిర్నా మీనన్ ఈ చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు.


