సందీప్ కిషన్ హీరోగా, ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటించిన చిత్రం సిగ్మా. ఈ మూవీలో విజయ్ తనయుడు జేసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ సుభాస్కరన్ నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన సినిమా గాంధీ జయంతి రోజున థియేటర్లలో సందడి చేయనుంది.
ఇటీవలే సిగ్మా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. తాజాగా ఈ మూవీ నుంచి సులోచన అంటూ సాగే క్రేజీ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ పాటకు కృష్ణ చైతన్య లిరిక్స్ అందించగా.. శృతి రంజని ఆలపించారు. ఈ పాటను మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ సంగీతమందించారు. . ప్రముఖ నిర్మాణ, డిస్ట్రిబ్యూషన్ సంస్థ మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ లిమిటెడ్ ఈ చిత్రాన్ని కోస్తాంధ్ర, తెలంగాణలో విడుదల చేయనుండగా.. ఎన్ వీఆర్ సినిమా సీడెడ్‌లో రిలీజ్ చేస్తోంది. కాగా.. ఈ చిత్రంలో రాజు సుందరం, సంపత్ రాజ్, శివ్ పండిట్, అంబు దాసన్, యోగ్ జాపీ కీలక పాత్రలు పోషించారు.


