హీరోయిన్ తాప్సీ గురించి పరిచయం అక్కర్లేదు. తెలుగులోనూ పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. స్టార్ హీరోల సరసన కనిపించింది. ఇటీవలే ఈ ముద్దుగుమ్మ.. గాంధారీ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా నేరుగా ఓటీటీలోనే రిలీజైంది. నెట్‌ఫ్లిక్స్ వేదికగా అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం బాలీవుడ్‌లో సినిమాలు చేస్తోన్న బ్యూటీ తన కెరీర్‌లో ఎదురైన అనుభవాలను పంచుకుంది. ఈ సందర్భంగా ఓ చేదు సంఘటనను షేర్ చేసింది.
ఓ సినిమాకు తీసుకున్న తనను సడన్‌గా వద్దని చెప్పారని తాప్సీ గుర్తు చేసుకుంది. నాకు ఎలాంటి స్పష్టమైన కారణం చెప్పకుండానే తొలగించారని తెలిపింది. నన్ను ఎందుకు తీసేశారని నేను పదేపదే అడుగుతుండటంతో అసలు కారణం చెప్పారని వెల్లడించింది. అయితే ఆ తర్వాత హీరో భార్యకు తాను నచ్చలేదని తొలగించారని తెలిసి షాకయ్యానని పేర్కొంది. ఆమెకు నేనేందుకు నచ్చలేదో నాకు మాత్రం తెలియదని తాప్సీ తెలిపింది. ఇది అత్యంత దారుణంగా అనిపించిందని తాప్సీ అన్నారు. అయితే ఆ నటుడి.. అతని భార్య పేరును కానీ వెల్లడించలేదు.
తెలుగు, తమిళ సినిమాలతో కెరీర్ మొదలుపెట్టిన తాప్సీ.. 'చష్మే బద్దూర్' మూవీతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పింక్, థప్పడ్ వంటి సినిమాలతో తనకంటూ స్టార్ ఇమేజ్‌ని అక్కడ క్రియేట్ చేసుకుంది. ఝుమ్మంది నాదం మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ 2022లో చివరిగా ‘మిషన్ ఇంపాజిబుల్’లో మెరిసింది.


