రణ్‌బీర్ కపూర్, సాయిపల్లవి సీతారాములుగా వస్తోన్న మూవీ రామాయణ. ఈ చిత్రానికి నితీశ్ తివారీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో కేజీఎఫ్ హీరో యశ్.. రావణాసురుడి పాత్రలో కనిపించనున్నారు.
ఇటీవలే ఈ మూవీ నుంచి సాంగ్ రిలీజ్ చేశారు. జయ జయ రామ్ అనే పాట హిందీ వర్షన్ విడుదల చేశారు. తాజాగా తెలుగు వర్షన్ కూడా వచ్చేసింది. ఈ సాంగ్‌లో రాముడిగా రణ్‌వీర్ కపూర్.. సీతగా సాయి పల్లవి అలరించారు. ఈ పాటకు రాకేందు మౌళి లిరిక్స్ అందించగా.. ఏఆర్ రెహమాన్, హన్స్ జిమ్మర్ కంపోజ్ చేశారు. ఈ సాంగ్‌ను దీపాలి, రాఘవ్ కౌశిక్ ఆలపించారు. కాగా.. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలోని తొలి భాగం దీపావళి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది.


