ప్రభాస్ హీరోగా నటించిన పాన్ ఇండియన్ ఫిల్మ్ ‘కల్కి 2898 ఏడీ’కి సీక్వెల్‌గా ‘కల్కి 2898 ఏడీ 2’ రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ అక్టోబరులో ఆరంభం కానుంది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ‘కల్కి 2898 ఏడీ’లో అమితాబ్ బచ్చన్, కమల్‌హాసన్, దీపికా పదుకోన్, దిశా పటానీ కీలక పాత్రలు పోషించారు. వైజయంతి మూవీస్‌పై అశ్వినీ దత్ నిర్మించిన ఈ చిత్రం 2024 జూన్ 27న విడుదలై, సూపర్ హిట్‌గా నిలిచింది.
ఈ మూవీకి సీక్వెల్ ఉంటుందని గతంలోనే పేర్కొన్న చిత్రయూనిట్ తాజాగా ఓ అప్‌డేట్ ఇచ్చింది. ‘కల్కి 2898 ఏడీ 2’ రెగ్యులర్ షూటింగ్‌ని అక్టోబరులో ప్రారంభించనున్నట్లు తెలిపింది. ‘‘ఎపిక్ సైన్స్ ఫిక్షన్ మైథలాజికల్‌గా రూపొందిన ‘కల్కి 2898 ఏడీ’ కోసం నాగ్ అశ్విన్ సృష్టించిన ప్రపంచాన్ని ఇప్పుడు ‘కల్కి 2898 ఏడీ 2’ కోసం మరింత భారీ స్థాయిలో విస్తరిస్తున్నాం.
ఈ సీక్వెల్‌లో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్‌హాసన్ మరోసారి అలరించబోతున్నారు. మా సినిమా రెండు జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది. దీంతో సీక్వెల్‌పై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ కారణంగా దేశవ్యాప్తంగా అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఒకటిగా మారింది. ప్రభాస్‌తో పాటు ఇతర నటీనటులు అక్టోబరు నుంచి షూటింగ్‌లో పాల్గొంటారు. 2027 జూన్‌లోపు చిత్రీకరణ పూర్తి చేయాలని నాగ్ అశ్విన్ లక్ష్యంగా పెట్టుకున్నారు’’ అని చిత్రయూనిట్ తెలిపింది.


