రణ్‌బీర్‌ కపూర్‌ రామాయణ.. తెలుగు ట్రైలర్ వచ్చేసింది | Nitesh Tiwari Namit Malhotra Ramayana Telugu Trailer | Sakshi
Sakshi News home page

Ramayana Telugu Trailer: రామాయణ తెలుగు ట్రైలర్ రిలీజ్

Sep 27 2026 12:08 PM | Updated on Sep 27 2026 12:28 PM

Nitesh Tiwari Namit Malhotra Ramayana Telugu Trailer

రణ్‌బీర్ కపూర్, సాయిపల్లవి సీతారాములుగా వస్తోన్న మూవీ రామాయణ. ఈ చిత్రానికి నితీశ్ తివారీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో కేజీఎఫ్ హీరో యశ్.. రావణాసురుడి పాత్రలో కనిపించనున్నారు. ఇటీవలే ఈ మూవీ నుంచి జయ జయ రామ్‌ అనే సాంగ్ రిలీజ్‌ చేశారు.

తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ రిలీజ్ చేశారు మేకర్స్. రామాయణ కథ అందరికీ తెలిసిందే. ఈ ట్రైలర్‌లో విజువల్స్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. రాముడిగా రణ్‌బీర్‌ కపూర్‌ లుక్‌ అదిరిపోయింది. ఈ చిత్రంలో కేజీఎఫ్ హీరో యశ్ రావణాసురుడిగా కనిపించనున్నారు. కాగా.. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలోని తొలి భాగం దీపావళి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో శూర్పణఖగా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కనిపించనుంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement