‘ప్రేమనే ఊరిలో’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌! | Premane Oorilo Movie Release Date Fix | Sakshi
Sakshi News home page

‘ప్రేమనే ఊరిలో’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌!

Sep 27 2026 3:58 PM | Updated on Sep 27 2026 4:23 PM

Premane Oorilo Movie Release Date Fix

శ్రీ రామ్, రామికా శివు, తపస్విని పూనాచ, రంగాయణ రఘు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ప్రేమనే ఊరిలో’. మనోజ్‌ కుమార్‌ దర్శకత్వంలో చందు శ్రీనివాస్, సురేష్‌ కొండేటి, మమత దేవేంద్ర .ఎం నిర్మించారు. ఈ నెల 25న కన్నడలో విడుదలైన ఈ చిత్రానికి ఆడియన్స్‌ నుంచి మంచి స్పందన లభించినట్లు యూనిట్‌ పేర్కొంది. అక్టోబరు 2న ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేయనున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు.

 ‘‘అందమైన ప్రేమకథతో రూ΄÷ందిన చిత్రం ‘ప్రేమనే ఊరిలో’. మా సినిమాని తెలుగు ప్రేక్షకులు కూడా అద్భుతంగా ఆదరిస్తారనే నమ్మకం ఉంది. సునద్‌ గౌతమ్‌ సంగీతం అందించిన ఈ చిత్రం నుండి విడుదలైన ΄ాటలకు, అలాగే టీజర్, ట్రైలర్‌కు తెలుగులోనూ అద్భుత స్పందన రావడం హ్యాపీగా ఉంది. రాజ్‌కాంత్‌ ఎస్‌.కె విజువల్స్‌ ఆకట్టుకుంటాయి’’ అని యూనిట్‌ పేర్కొంది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement