‘ప్రేమనే ఊరిలో’ రిలీజ్ డేట్ ఫిక్స్!
శ్రీ రామ్, రామికా శివు, తపస్విని పూనాచ, రంగాయణ రఘు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ప్రేమనే ఊరిలో’. మనోజ్ కుమార్ దర్శకత్వంలో చందు శ్రీనివాస్, సురేష్ కొండేటి, మమత దేవేంద్ర .ఎం నిర్మించారు. ఈ నెల 25న కన్నడలో విడుదలైన ఈ చిత్రానికి ఆడియన్స్ నుంచి మంచి స్పందన లభించినట్లు యూనిట్ పేర్కొంది. అక్టోబరు 2న ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ‘‘అందమైన ప్రేమకథతో రూ΄÷ందిన చిత్రం ‘ప్రేమనే ఊరిలో’. మా సినిమాని తెలుగు ప్రేక్షకులు కూడా అద్భుతంగా ఆదరిస్తారనే నమ్మకం ఉంది. సునద్ గౌతమ్ సంగీతం అందించిన ఈ చిత్రం నుండి విడుదలైన ΄ాటలకు, అలాగే టీజర్, ట్రైలర్‌కు తెలుగులోనూ అద్భుత స్పందన రావడం హ్యాపీగా ఉంది. రాజ్‌కాంత్ ఎస్.కె విజువల్స్ ఆకట్టుకుంటాయి’’ అని యూనిట్ పేర్కొంది.