తపస్విని, సాయికుమార్, శ్రీరామ్
‘ప్రేమనే ఊరిలో..’ మన సినిమా... మన మట్టి చిత్రం. మన ఊరి సినిమా... కథలో మంచి ఎమోషన్ ఉంది. అలాగే రైతు గొప్పదనం గురించి చెప్పారు. ఒక చెట్టు గురించి కూడా మంచి సందేశం ఇచ్చారు. మనల్ని ఆకట్టుకునే ఎన్నో అంశాలు ఈ సినిమాలో ఉన్నాయి. ఈ చిత్రకథ మనసుల్ని కదిలిస్తుంది’’ అని నటుడు సాయికుమార్ తెలిపారు. శ్రీ రామ్, రామికా శివు, తపస్విని పూనాచ, రంగాయణ రఘు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ప్రేమనే ఊరిలో..’. మనోజ్ కుమార్ దర్శకత్వంలో చందు శ్రీనివాస్, సురేష్ కొండేటి, మమత దేవేంద్ర ఎం. నిర్మించారు.
ఈ నెల 2న విడుదలైన ‘ప్రేమనే ఊరిలో..’ మూవీ గ్రాండ్ సక్సెస్ మీట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. సాయికుమార్ అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హీరో శ్రీరామ్ మాట్లాడుతూ– ‘‘యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్సకి నచ్చేలా మా సినిమా ఉంటుంది. ఒక మంచి సినిమా చూసిన అనుభూతిని పొందుతారు’’ అని చెప్పారు. ‘‘తెలుగు ప్రేక్షకులు మా సినిమాపై చూపిస్తున్న ప్రేమ, ఆదరణకు కృతజ్ఞతలు’’ అన్నారు మమత దేవేంద్ర.
‘‘మా సినిమాకి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుండటంతో థియేటర్స్, స్క్రీన్స పెంచాం’’ అని సురేష్ కొండేటి తెలిపారు. ‘‘మా సినిమా చూస్తూ ప్రేక్షకులు ఎమోషనల్ అవుతున్నారు’’ అన్నారు చందు శ్రీనివాస్. ‘‘యూనిట్ అంతా థియేటర్స్‌కి వెళ్లాం. ప్రేక్షకుల అభినందనలు మాకు ఎంతో సంతోషాన్నిచ్చాయి’’ అని తపస్విని పునాచ పేర్కొన్నారు.


