ప్రస్తుతం బిగ్‌బాస్ 12వ వారానికి చేరుకుంది. ఈ వీక్‌లో దశవతారంలో భాగంగా బడ్డీ అప్ అనే పేరు పెట్టారు. ఇందులో భాగంగా బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్స్‌ను హౌస్‌లోకి తీసుకొస్తున్నారు. అలా తొలిరోజు ఇమ్ము, సంజనా, కల్యాణ్, దివ్య వచ్చివెళ్లారు. వీరితో హౌస్‌లోని కంటెస్టెంట్స్‌తో గేమ్స్ ఆడించారు. ఇందులో గెలిచినవాళ్లను కెప్టెన్ కంటెండర్ రేసుకు అర్హత సాధించారని బిగ్‌బాస్ ప్రకటించాడు.
బడ్డీ అప్‌లో భాగంగా రెండో రోజు కూడా మరో నలుగురు మాజీ కంటెస్టెంట్స్ హౌస్‌లో అడుగుపెట్టారు. ఈ సారి మొదట హౌస్‌లో డీమాన్ పవన్, రీతూ చౌదరిని తీసుకొచ్చారు. వీరితో హౌస్‌లోని ముకేశ్, దేబ్జానీలతో గేమ్ ఆడించారు. ముకేశ్, రీతూ ఒకవైపు, డీమాన్ పవన్, దేబ్జానీ ఓ వైపు నిలిచారు. ఈ టాస్క్‌లో సంచాలక్‌గా త్రిగుణ్ వ్యవహరించాడు. ఈ గేమ్‌లో రూల్స్ పాటించవేదని ముకేశ్‌ను సంచాలక్ కడిగిపారేశాడు. ఈ టాస్కులో చివరకు దేబ్జానీ, పవన్ గెలిచారని సంచాలక్ త్రిగుణ్ ప్రకటిస్తాడు.
ఆ తర్వాత ఇంట్లోకి టేస్టీ తేజ, శోభా శెట్టి ఎంట్రీ ఇస్తారు. ఫ్రెండ్ షిప్‌ని కంటిన్యూ ఎవరితో చేస్తారో వారి బ్యాండ్ ఇవ్వాలి.. ఎవరితో కట్ చేస్తారో వారి చేతికి ఉన్న బ్యాండ్‌ను కట్ చేయాలని బిగ్‌బాస్ చెప్తాడు. ఇందులో త్రిగుణ్ వచ్చి.. వంశీతో కంటిన్యూ చేస్తా.. వర్షిణితో కట్ చేస్తానని చెప్తాడు. ఆ తర్వాత ముకేశ్ వచ్చి.. వర్షిణితో కంటిన్యూ సుధీర్‌ను కట్ చేస్తానంటాడు. దేబ్జానీ నరేశ్‌తో ఫ్రెండ్‌షిప్ కంటిన్యూ చేస్తానని చెబుతుంది.
ఆ తర్వాత శోభా శెట్టి- అమన్, నరేశ్- టేస్టీ తేజ పెయిర్‌గా ఓ గేమ్ ఆడతారు. ఈ టాస్క్‌లో సంచాలక్‌గా వర్షిణిని పెడతారు. అయితే ఈ టాస్క్‌లో సంచాలక్ వర్షిణి తీరుపై అమన్, శోభా ఫైరవుతారు. ప్రతిసారి బాల్‌ను నరేశ్ వైపు వేయడమేంటని నిలదీస్తారు. కానీ వర్షిణి మాత్రం నరేశ్ టీమ్‌కు ఫేవర్‌గానే చేస్తుంది. కానీ చివరకీ ఈ టాస్క్‌లో అమన్, శోభానే విన్ అవుతారు. దీంతో వర్షిణిపై అమన్ మరోసారి ఫైరవుతాడు. వర్షిణి అన్ ఫెయిర్ సంచాలక్ అంటూ గట్టిగా అరుస్తాడు. అలా ఇవాల్టి ఎపిసోడ్ ముగుస్తుంది.


