ఓటీటీలోకి మమిత సూపర్ హిట్ సినిమా.. అధికారిక ప్రకటన | Bethlehem Kudumba Unit Movie OTT Release Date Latest Update | Sakshi
Sakshi News home page

Bethlehem Kudumba Unit OTT: మమిత రూ.300 కోట్ల మూవీ.. ఓటీటీలోకి ఎప్పుడంటే?

Sep 27 2026 2:51 PM | Updated on Sep 27 2026 3:38 PM

Bethlehem Kudumba Unit Movie OTT Release Date Latest Update

రీసెంట్ టైంలో మూడు సినిమాలతో ప్రేక్షకుల్ని పలకరించిన ట్రెండింగ్ హీరోయిన్ మమిత బైజు.. అన్నింటితోనూ వందల కోట్ల కలెక్షన్స్ అందుకుంది. ఈమె నటించిన జన నాయగన్, విశ్వనాథ్ అండ్ సన్స్ ఇప్పటికే ఓటీటీలోకి వచ్చేయగా.. లేటెస్ట్ సెన్సేషనల్ మలయాళ ఫీల్ గుడ్ రొమాంటిక్ హిట్ మూవీ కూడా స్ట్రీమింగ్‌కి సిద్ధమైంది. ఈ మేరకు అధికారిక ప్రకటన వచ్చేసింది.

(ఇదీ చదవండి: శోభనం రాత్రి ఏం జరిగింది? ఓటీటీ సినిమా తెలుగు రివ్యూ)

'ప్రేమలు' దర్శకుడు గిరీష్ ఏడీ తీసిన లేటెస్ట్ సినిమా 'బెత్లెహెమ్ కుడుంబ యూనిట్'. ఓనం సందర్భంగా ఆగస్టు 21న మలయాళం వరకు థియేటర్లలో రిలీజైంది. రెండు వారాల తర్వాత అంటే ఈ నెల 04వ తేదీన తెలుగులోనూ విడుదలై హిట్ అయింది. చిన్న చిత్రమే అయినప్పటికీ ఓవరాల్‌గా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రికార్డులు సృష్టించింది.

లెక్క ప్రకారం ఈ పాటికే ఓటీటీలోకి వచ్చేయాలి. కానీ థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతున్న కారణంగా కాస్త లేటుగా ఇప్పుడు డిజిటల్ రిలీజ్ చేయబోతున్నారు. వచ్చే శుక్రవారం(అక్టోబరు 02) నుంచి హాట్‌స్టార్‌లో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుందని ప్రకటించారు.

'బెత్లెహెమ్ కుడుంబ యూనిట్' విషయానికొస్తే.. ఆష్లే (మమిత బైజు) కాలేజీ చదివే అమ్మాయి. తండ్రి తాగుడుకు బానిసవ్వడం, ఆర్థిక ఇబ్బందుల వల్ల ఈమె కుటుంబం సొంత ఊరు వదిలి అంగమాలికి వచ్చేస్తుంది. అక్కడే స్థానిక చర్చికి సంబంధించిన ఓ పార్థనా బృందం బెత్లెహోమ్‌ కుటుంబ యూనిట్‌ పరిచయమవుతుంది. ఆష్లే అద్దెకి దిగిన ఇంటి పక్కనే జస్టిన్‌ (నివిన్‌ పౌలీ) తన కుటుంబంతో కలిసి నివసిస్తుంటాడు. ఊరిలో కేటరింగ్‌ బిజినెస్‌ చేసుకుంటూ అందరితో కలివిడిగా, మంచిగా ఉండే సాదాసీదా బ్యాచిలర్‌ ఇతడు. చదువుకునే రోజుల్లో ఎదురైన ఓ బ్రేకప్‌ వల్ల పెళ్లి వద్దనుకుంటాడు.

ఇతడికీ ఆష్లేకి మధ్య 13 ఏళ్ల వయసు వ్యత్యాసం ఉంటుంది. కానీ జస్టిన్ మంచితనం, వ్యక్తిత్వం, అభిరుచులు నచ్చి తనపై ఆష్లే మనసు పారేసుకుంటుంది. ఈ విషయం తెలిశాక జస్టిన్‌ కూడా ఆమెని ప్రేమించడం మొదలుపెడతాడు. అనుకోని సంఘటన వల్ల వీళ్ల రహస్య ప్రేమ  ఇంట్లోని పెద్దలకు తెలుస్తుంది. తర్వాత ఏమైంది? ఇద్దరు ఒక్కటయ్యారా లేదా అనేది మిగతా స్టోరీ.

(ఇదీ చదవండి: సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన హిట్ సినిమా)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement