breaking news
Bethlehem Kudumba Unit Movie
-
'ప్రేమలు 2'.. మాకు చాలా పెద్ద ఎదురుదెబ్బ
రెండేళ్ల క్రితం వచ్చిన 'ప్రేమలు' ఎంత సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమాతోనే మమిత బైజు వెలుగులోకి వచ్చింది. తెలుగోళ్లకు ఫేవరెట్ హీరోయిన్ అయిపోయింది. ఈ మూవీ తీసిన దర్శకుడు గిరీష్ ఏడీ.. దీనికి సీక్వెల్ తీయాలనుకున్నాడు. ఈ మేరకు అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు. కానీ ఉన్నట్లుండి ఆపేశారు. ఇప్పుడా విషయంపై స్వయంగా డైరెక్టర్ స్పందించాడు. తన అసంతృప్తిని స్టేజీపై వ్యక్తం చేశాడు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 25 సినిమాలు.. ఆ ఐదు డోంట్ మిస్)ఇదే దర్శకుడు, మమిత బైజుతో కలిసి చేసిన లేటెస్ట్ మూవీ 'బెత్లెహెమ్ కుడుంబ యూనిట్'. కొన్నిరోజుల క్రితం థియేటర్లలోకి, రీసెంట్గా ఓటీటీలోకి వచ్చిన ఈ సినిమా అద్భుతమైన హిట్‌గా నిలిచి మలయాళంలో అత్యధిక కలెక్షన్లు సాధించింది. ఈ క్రమంలోనే ఆదివారం సాయంత్రం కొచ్చిలో సక్సెస్ మీట్ నిర్వహించారు. ఇందులో దర్శకుడు గిరీష్.. 'ప్రేమలు 2' గురించి మాట్లాడాడు.“ఈ సినిమా(బెత్లెహెమ్ కుడుంబ యూనిట్) మొదలుపెట్టడానికి ముందు ఏడాది పాటు ‘ప్రేమలు 2’ కోసం పనిచేశాను. అనుకోకుండా ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. అది మాకు చాలా పెద్ద ఎదురుదెబ్బ. దీనివల్ల మా విలువైన ఏడాది టైం వేస్ట్ అయింది. అంత సమయం కోల్పోవాల్సిన అవసరం లేదు. దీని తర్వాతే ‘బెత్లెహెం’ ఆలోచన వచ్చింది. ‘ప్రేమలు’ హిట్ అవ్వకముందే ఈ మూవీ తీయాలనుకున్నాను. ‘ప్రేమలు’ సూపర్ హిట్ అయ్యేసరికి దానికి సీక్వెల్ చేయాలనే ఆలోచన వచ్చింది''అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ‘ప్రేమలు 2’ గతేడాది విషు పండుగ సందర్భంగా థియేటర్లలో విడుదలయ్యేది. కానీ ‘బెత్లెహెం’ సినిమా దాని తర్వాత మూడు నుంచి నాలుగు నెలల్లోనే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రాన్ని తక్కువ సమయంలోనే పూర్తి చేయగలిగాం. ఇది ఇంత పెద్ద హిట్ అవుతుందని, ఇండస్ట్రీ హిట్‌గా నిలుస్తుందని మేమెప్పుడూ ఊహించలేదు' అని గిరీష్ ఏడీ చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 10: షాలిని ఎలిమినేట్.. వెక్కివెక్కి ఏడ్చేసిన రోహిత్)Girish AD about #Premalu2 🎬 We wasted a year on Premalu 2. There was absolutely no need to shelved it. https://t.co/stibIXDAXW— Kerala Trends (@KeralaTrends2) October 18, 2026 -
7 నిమిషాల్లో 'సినిమా' చూపించేశారు
లేటెస్ట్ సెన్సేషనల్ హీరోయిన్ ఎవరంటే చాలామంది చెప్పే పేరు మమిత. ఎందుకంట ఈ మధ్య కాలంలో తెలుగు, తమిళ, మలయాళంలో సినిమాలు చేసిన ఈమె.. వాటన్నింటితో కలిసి రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకుంది. జన నాయగన్, విశ్వనాథ్ అండ్ సన్స్ మాటేమో గానీ మలయాళంలో చేసిన 'బెత్లెహెమ్ కుడుంబ యూనిట్' చిత్రం మమితకు మంచి పేరు తీసుకొచ్చింది.(ఇదీ చదవండి: రజనీకాంత్‌కే ఇలాంటి పరిస్థితా?)తెలుగులోనూ థియేటర్లలో రిలీజై ఆకట్టుకున్న ఈ సినిమా.. హాట్‌స్టార్ ఓటీటీలోకి వచ్చిన తర్వాత మరింత మందికి చేరువయింది. సింపుల్ కథనే అందంగా తీసిన ఈ సినిమా మేకింగ్ వీడియోని తాజాగా రిలీజ్ చేశారు. దాదాపు రెండున్నర గంటల మూవీని 7 నిమిషాల వీడియోలో అంతా చూపించేశారు. తెర వెనక షూటింగ్లో భాగంగా ఎంత హంగామా నడిచిందో వీడియోగా వదిలారు. ఇదిప్పుడు నెటిజన్లని అలరిస్తోంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 25 సినిమాలు.. ఆ ఐదు డోంట్ మిస్) -
మమిత పెళ్లిపై నిర్ణయం అతడిదే.. ఈమె రియాక్షన్ ఇది
ప్రస్తుతం దక్షిణాదిలో ట్రెండింగ్ హీరోయిన్ ఎవరైనా ఉన్నారా అంటే అది మమిత బైజునే. తెలుగు, తమిళ, మలయాళ సినిమాలతో ఎప్పటికప్పుడు కనిపిస్తూ ప్రేక్షకులని పలకరిస్తోంది. రీసెంట్ టైంలో అయితే జన నాయగణ్, విశ్వనాథ్ అండ్ సన్స్, బెత్లెహెమ్ కుడుంబ యూనిట్ చిత్రాలతో వచ్చింది. పలు తెలుగు చిత్రాల్లో హీరోయిన్గా ఈమెని తీసుకుంటారనే టాక్ వినిపిస్తోంది. ఇవలా ఉండగానే పెళ్లిపై వస్తున్న పుకార్లపై మమిత స్పందించింది.(ఇదీ చదవండి: అందుకే షాలినిని ఉంచి నన్ను పంపించేశారు: చరణ్)మమితా బైజు జీవితంలోని ప్రతి నిర్ణయాన్ని, ముఖ్యంగా ఆమె ఎవరిని పెళ్లి చేసుకోవాలనే దానిని ఆమె సోదరుడు మిథున్ బైజునే నిర్ణయిస్తాడని వరుసగా పోస్ట్‌లు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. వీటిలో ఒకదానికి స్పందించిన మమిత.. ఫన్నీగా ‘వాట్’ అనే స్టికర్ని రిప్లై ఇచ్చింది. దీంతో ఇదికాస్త సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది.ప్రస్తుతం మమిత తమిళంలో విష్ణు విశాల్ హీరోగా చేసిన 'ఇరండు వానం'లో నటించింది. దీనితో పాటు భారీ స్థాయిలో తెరకెక్కుతోన్న ‘జై హనుమాన్’లోనూ ఈమెకు అవకాశం దక్కినట్లు తెలుస్తోంది. ఇందులో ఓ కీలక పాత్ర కోసం చిత్రబృందం మమితా బైజును రంగంలోకి దించినట్లు మాట్లాడుకుంటున్నారు.(ఇదీ చదవండి: దసరా మూవీస్.. హైప్ ఎలా ఉంది?) -
బెత్లెహమ్ కుటుంబ యూనిట్.. ఓటీటీలోనూ క్రేజీ రికార్డ్
ఇటీవల రిలీజై సూపర్ హిట్‌గా నిలిచిన మలయాళ సినిమా బెత్లెహమ్ కుటుంబం యూనిట్. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలో మమితా బైజు కీలక పాత్రలో మెప్పించింది. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీ ప్రియులకు అందుబాటులోకి వచ్చేసింది. జియో హాట్‌స్టార్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది.ఈ నేపథ్యంలోనే ఓటీటీలోనూ బెత్లెహమ్ కుటుంబ యూనిట్ దూసుకెళ్తోంది. తొలి వీకెండ్లోనే అద్భుతమైన రెస్సాన్స్ అందుకుంది. దీంతో మరో రికార్డ్ తన ఖాతాలో వేసుకుంది. జియో హాట్‌స్టార్‌లో అక్టోబరు 2 నుంచి 4 వరకు అత్యధిక మంది వీక్షించిన నాన్ హిందీ చిత్రంగా నిలిచింది. ఈ విషయాన్ని ప్రముఖ ఆర్మాక్స్ మీడియా వెల్లడించింది. ఈ చిత్రాన్ని ఏకంగా 5.4 మిలియన్ల మంది వీక్షించినట్లు తెలిపింది.కాగా..ఈ చిత్రాన్ని గిరీశ్ ఏడీ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ చిత్రంలో మమితాబైజు, నివిన్ పౌలి జంటగా నటించారు. ఫహాద్ ఫాజిల్, దిలీష్ పోతాన్, శ్యామ్ పుష్కరన్ ఈ మూవీని నిర్మించారు. సెప్టెంబరు 4న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం జియోహాట్ స్టార్ వేదికగా మలయాళంతో పాటు, తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది. Ormax StreamView: Malayalam film Bethlehem Kudumba Unit (JioHotstar) has set a new benchmark, emerging as the most-watched non-Hindi film in India during its opening weekend on streaming. It is also the most-liked theatrical film in India in 2026 across languages, with an Ormax Power Rating (OPR) of 92 Note: Views represent unique audiences in India who watched the film for more than 30 mins. across all language versions during its opening weekend on streaming (Oct 2-4)— Ormax Media (@OrmaxMedia) October 7, 2026 -
అప్పుడు భయపెట్టాడు.. ఇప్పుడు తెగ నవ్వించాడు
అప్పుడప్పుడు కొన్ని సినిమాలు తెగ వైరల్ అయిపోతుంటాయి. అలాంటి ఓ మూవీనే 'బెత్లెహెమ్ కుడుంబ యూనిట్'. ఇదో మలయాళ చిత్రం. గత నెలలో థియేటర్లలో రిలీజై ఓ మాదిరిగా ఆకట్టుకుంది. కానీ గత వీకెండ్ హాట్‌స్టార్ ఓటీటీలోకి వచ్చిన తర్వాత సోషల్ మీడియా అంతా దీని గురించే మాట్లాడుకుంటున్నారు. మమిత ఎప్పటిలానే ట్రెండ్ అవగా.. మిగిలిన పాత్రధారులకు సంబంధించిన విషయాలు కూడా బయటపడుతున్నాయి. అలా ఓ షాకింగ్ డీటైల్ రివీల్ అయింది.(ఇదీ చదవండి: 'ప్యారడైజ్' ఎఫెక్ట్.. చిరుతో సినిమాపై నాని కామెంట్స్)'బెత్లెహెమ్ కుడుంబ యూనిట్' మూవీలో బైజు అనే పాత్రలో కనిపించి తెగ నవ్వించిన నటుడు.. 26 ఏళ్ల క్రితం వచ్చిన ఓ తెలుగు డబ్బింగ్ మూవీతో గజగజా భయపెట్టాడని మీలో ఎంతమందికి తెలుసు. అవును రోజా ప్రధాన పాత్ర చేసిన 'దుర్గా' సినిమా 2000లో రిలీజైంది. ఇందులో భయంకరంగా ఉంటూ భయపెట్టిన విలనే ఇప్పుడు 'బెత్లెహెమ్ కుడుంబ యూనిట్'లో బైజుగా కనిపించాడు. అతడి అసలు పేరు సురేశ్ కృష్ణ.2000 నాటి మూవీలో ఉన్నది.. ఇప్పుడు ఈ సినిమాలో ఉన్నది నేనే అని స్వయంగా సురేశ్ కృష్ణనే ఇన్ స్టాలో పోస్ట్ పెట్టి క్లారిటీ ఇచ్చాడు. ఈ నటుడి కెరీర్ విషయానికొస్తే.. 1993 నుంచి సినిమాల్లో నటిస్తున్నాడు. కాకపోతే దుర్గా(తమిళంలో 'పొట్టు అమ్మన్') చేసిన తర్వాత వరస అవకాశాలు ఇతడిని వరించాయి. అలా సహాయ పాత్రలు బోలెడన్ని చేసి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు బెత్లెహెమ్ కుడుంబ యూనిట్' ఓటీటీ రిలీజ్ వల్ల తెలుగు నెటిజన్లకు ఆప్తుడు అయిపోయాడు. 1998-2007 మధ్య మలయాళ టీవీ సీరియల్స్‌లోనూ ఇతడు నటించడం విశేషం.(ఇదీ చదవండి: ‘బెత్లెహోమ్ కుటుంబ యూనిట్’ మూవీ రివ్యూ) View this post on Instagram A post shared by Suresh Krishna (@actor_sureshkrishna) -
ఈ వారం ఓటీటీల్లోకి 23 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్
మరోవారం వచ్చేసింది. ఈసారి గాంధీ జయంతితో పాటు వీకెండ్ కలిసొచ్చింది. కానీ చెప్పుకోదగ్గ మూవీస్ థియేటర్లలోకి రావట్లేదు. ఉన్నంతలో రాజమౌళి కొడుకు కార్తికేయ నిర్మాతగా ఫహాద్ ఫాజిల్ హీరోగా చేసిన 'డోంట్ ట్రబుల్ ద ట్రబుల్' మూవీతో పాటు దళపతి విజయ్ కొడుకు జేసన్ దర్శకుడిగా తొలిసారి చేసిన 'సిగ్మా', తెల్ల కాగితం, అనకాపల్లి, ప్రేమనే ఊరిలో తదితర మూవీస్ ఈ వీకెండ్ బిగ్ స్క్రీన్స్‌పైకి రానున్నాయి.(ఇదీ చదవండి: ఓటీటీలోకి సందీప్ రెడ్డి వంగా కొత్త సినిమా.. అధికారిక ప్రకటన)మరోవైపు ఓటీటీల్లోనూ 23 వరకు సినిమాలు, సిరీస్‌లు స్ట్రీమింగ్ కానున్నాయి. మమిత బైజు చేసిన సెన్సేషనల్ హిట్ 'బెత్లెహెమ్ కుడుంబ యూనిట్', #లవ్ సిరీస్, పూజా మేరీ జాన్, రోమాంచకం చిత్రాలు ఉన్నంతలో ఆసక్తికరంగా అనిపిస్తున్నాయి. వీటితోపాటు మరికొన్ని వీకెండ్ టైంలో సడన్ స్ట్రీమింగ్ అయ్యే అవకాశముంది. ఇంతకీ ఏ ఓటీటీలో ఏ మూవీ అందుబాటులోకి రానుందంటే?ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (సెప్టెంబరు 27 నుంచి అక్టోబర్ 04 వరకు)హాట్స్టార్మైన్ లడేగా (హిందీ సిరీస్) - సెప్టెంబరు 30బెత్లెహెమ్ కుడుంబ యూనిట్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - అక్టోబరు 02మార్షల్స్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబరు 04ట్రాకర్ సీజన్ 4 (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబరు 04నెట్ఫ్లిక్స్డెత్ ఆఫ్ ఏ యూనికార్న్ (ఇంగ్లీష్ సినిమా) - సెప్టెంబరు 28ఇర్రెప్లేసబుల్ (చైనీస్ సిరీస్) - సెప్టెంబరు 28డిమోన్ స్లేయర్: ఇన్ఫినిటీ కేజిల్ (జపనీస్ సిరీస్) - సెప్టెంబరు 28ఐ పాప్-స్టార్స్ (హిందీ రియాలిటీ షో) - సెప్టెంబరు 29లెగో వన్ పీస్ (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 29ద ఎరీనా (ఫ్రెంచ్ సిరీస్) - సెప్టెంబరు 30మెదుశా సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 30రోమాంచకం (తెలుగు సినిమా) - అక్టోబరు 01ఈస్ట్ ఆఫ్ ఈడెన్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబరు 01ఓ మై డాగ్ (హిందీ సినిమా) - అక్టోబరు 01#లవ్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - అక్టోబరు 02డూయింగ్ లైఫ్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - అక్టోబరు 02షూమాకర్ '94: ద బర్త్ ఆఫ్ ఏ లెజెండ్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబరు 02అమెజాన్ ప్రైమ్దుపాహియా సీజన్ 2 (హిందీ సిరీస్) - అక్టోబరు 01జీ5పంథడిక్కామ్ (మలయాళ సిరీస్) - అక్టోబరు 01పూజా మేరీ జాన్ (హిందీ సినిమా) - అక్టోబరు 02మదర్ ప్రామిస్ (కన్నడ చిత్రం) - అక్టోబరు 02ఈవిల్ డెడ్ బర్న్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - అక్టోబరు 02ఆపిల్ టీవీ ప్లస్ద లాస్ట్ ఫస్ట్: వింటర్ కె2 (ఇంగ్లీష్ మూవీ) - అక్టోబరు 02(ఇదీ చదవండి: నా భార్య కనిపించట్లేదు.. ఓటీటీ కోసం కలిసిన హిట్ జోడీ) -
ఓటీటీలోకి మమిత సూపర్ హిట్ సినిమా.. అధికారిక ప్రకటన
రీసెంట్ టైంలో మూడు సినిమాలతో ప్రేక్షకుల్ని పలకరించిన ట్రెండింగ్ హీరోయిన్ మమిత బైజు.. అన్నింటితోనూ వందల కోట్ల కలెక్షన్స్ అందుకుంది. ఈమె నటించిన జన నాయగన్, విశ్వనాథ్ అండ్ సన్స్ ఇప్పటికే ఓటీటీలోకి వచ్చేయగా.. లేటెస్ట్ సెన్సేషనల్ మలయాళ ఫీల్ గుడ్ రొమాంటిక్ హిట్ మూవీ కూడా స్ట్రీమింగ్కి సిద్ధమైంది. ఈ మేరకు అధికారిక ప్రకటన వచ్చేసింది.(ఇదీ చదవండి: శోభనం రాత్రి ఏం జరిగింది? ఓటీటీ సినిమా తెలుగు రివ్యూ)'ప్రేమలు' దర్శకుడు గిరీష్ ఏడీ తీసిన లేటెస్ట్ సినిమా 'బెత్లెహెమ్ కుడుంబ యూనిట్'. ఓనం సందర్భంగా ఆగస్టు 21న మలయాళం వరకు థియేటర్లలో రిలీజైంది. రెండు వారాల తర్వాత అంటే ఈ నెల 04వ తేదీన తెలుగులోనూ విడుదలై హిట్ అయింది. చిన్న చిత్రమే అయినప్పటికీ ఓవరాల్‌గా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రికార్డులు సృష్టించింది.లెక్క ప్రకారం ఈ పాటికే ఓటీటీలోకి వచ్చేయాలి. కానీ థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతున్న కారణంగా కాస్త లేటుగా ఇప్పుడు డిజిటల్ రిలీజ్ చేయబోతున్నారు. వచ్చే శుక్రవారం(అక్టోబరు 02) నుంచి హాట్‌స్టార్‌లో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుందని ప్రకటించారు.'బెత్లెహెమ్ కుడుంబ యూనిట్' విషయానికొస్తే.. ఆష్లే (మమిత బైజు) కాలేజీ చదివే అమ్మాయి. తండ్రి తాగుడుకు బానిసవ్వడం, ఆర్థిక ఇబ్బందుల వల్ల ఈమె కుటుంబం సొంత ఊరు వదిలి అంగమాలికి వచ్చేస్తుంది. అక్కడే స్థానిక చర్చికి సంబంధించిన ఓ పార్థనా బృందం బెత్లెహోమ్ కుటుంబ యూనిట్ పరిచయమవుతుంది. ఆష్లే అద్దెకి దిగిన ఇంటి పక్కనే జస్టిన్ (నివిన్ పౌలీ) తన కుటుంబంతో కలిసి నివసిస్తుంటాడు. ఊరిలో కేటరింగ్ బిజినెస్ చేసుకుంటూ అందరితో కలివిడిగా, మంచిగా ఉండే సాదాసీదా బ్యాచిలర్ ఇతడు. చదువుకునే రోజుల్లో ఎదురైన ఓ బ్రేకప్ వల్ల పెళ్లి వద్దనుకుంటాడు.ఇతడికీ ఆష్లేకి మధ్య 13 ఏళ్ల వయసు వ్యత్యాసం ఉంటుంది. కానీ జస్టిన్ మంచితనం, వ్యక్తిత్వం, అభిరుచులు నచ్చి తనపై ఆష్లే మనసు పారేసుకుంటుంది. ఈ విషయం తెలిశాక జస్టిన్ కూడా ఆమెని ప్రేమించడం మొదలుపెడతాడు. అనుకోని సంఘటన వల్ల వీళ్ల రహస్య ప్రేమ ఇంట్లోని పెద్దలకు తెలుస్తుంది. తర్వాత ఏమైంది? ఇద్దరు ఒక్కటయ్యారా లేదా అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన హిట్ సినిమా)The entertainer everyone’s been waiting for! ❤️Bethlehem Kudumba Unit, streaming from October 2 on JioHotstar.@NivinOfficial @MamithaBaiju_ @BhavanaStudios @iDileeshPothan @BhavanaRelease @PharsFilm @PicturesPVR @MythriRelease @FutureRunup @PrimarkProd#BethlehemKudumbaUnit… pic.twitter.com/WcEqPKd61K— JioHotstar Malayalam (@JioHotstarMal) September 27, 2026 -
మమితా బైజు మూవీ.. బాక్సాపీస్ వద్ద మరో రికార్డ్
సినిమాల సక్సెస్ కావాలంటే కంటెంట్ మాత్రమే కింగ్ అని మరోసారి రుజువైంది. ఇటీవల మలయాళంలో రిలీజైన చిన్న సినిమా బాక్సాఫీస్ వద్ద అదరగొట్టింది. నివిన్ పౌలీ, మమితా బైజు జంటగా వచ్చిన బెత్లెహమ్ కుటుంబ యూనిట్ అరుదైన రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పటికే మలయాళంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. తాజాగా మరో మైలురాయి చేరుకుంది. ఈ సినిమా రిలీజైన 27 రోజుల్లోనే రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ విషయాన్ని అఫీషియల్‌గా ప్రకటించారు మేకర్స్. ఈ మలయాళ రొమాంటిక్ చిత్రాన్ని తెలుగులోనూ రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి గిరీష్ ఎ. డి. దర్శకత్వం వహించగా.. భావనా స్టూడియోస్ బ్యానర్లో నిర్మించారు. ఈ మూవీలో ఫహద్ ఫాసిల్, దిలీష్ పోతన్, శ్యామ్ పుష్కరన్ కీలక పాత్రల్లో నటించారు. హీరోయిన్ మమితా బైజు నటించిన విశ్వనాథ్ అండ్ సన్స్ సైతం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ విజయాలతో మమితా బైజు పట్టిందల్లా బంగారమే అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక నుంచి ఆమె డైరెక్టర్లకు లక్కీ హీరోయిన్గా కనిపించడం ఖాయమని తెలుస్తోంది. -
చిన్న సినిమా.. సరికొత్త బాక్సాఫీస్ రికార్డ్..!
చిన్న సినిమా అయినా సరే కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. భారీ తారాగణం, బడ్జెట్ లేకపోయినా బాక్సాఫీస్ వద్ద చిన్న చిత్రాలు సైతం అదరగొడుతున్నాయి. ఇటీవలే రవితేజ హీరోగా వచ్చిన ఇరుముడి కేవలం మౌత్ టాక్‌తోనే సూపర్ హిట్‌గా నిలిచింది. అలా మరో సినిమా సైతం కోట్లు కొల్లగొట్టింది. మలయాళంలో రిలీజైన బెత్లెహెం కుటుంబ యూనిట్ అనే మూవీ సరికొత్త చరిత్ర సృష్టించింది.తాజాగా ఈ మూవీ అరుదైన ఘనత సాధించింది. గిరీష్ ఏడీ దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ కామెడీ కేవలం 24 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.304.9 కోట్లు వసూలు చేసింది. ఈ కలెక్షన్లతో మలయాళంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డ్ సృష్టించింది. గతంలో సూపర్ హిట్‌గా నిలిచిన కొత్త లోకా(రూ.302 కోట్లు) వసూళ్లును ఈ మూవీ దాటేసింది. దీంతో మలయాళ బాక్సాఫీస్ వద్ద అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది బెత్లెహెం కుటుంబ యూనిట్.కాగా.. ఈ చిత్రంలో నివిన్ పౌలీ, మమితా బైజు కీలక పాత్రల్లో నటించారు. మలయాళంలో సూపర్ హిట్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని తెలుగులోనూ రిలీజ్ చేశారు. ఈ ఏడాది థియేటర్లలో భారీ విజయం సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ఈ చిత్రాన్ని భావన స్టూడియోస్ బ్యానర్లో ఫహద్ ఫాసిల్, దిలీష్ పోతన్, శ్యామ్ పుష్కరన్ నిర్మించారు. ఈ సినిమాలో సంగీత్ ప్రతాప్, శ్యామ్ మోహన్, వినయ్ ఫోర్ట్, సురేష్ కృష్ణ, బిందు పనికర్, శ్రీంద కీలక పాత్రలు పోషించారు.Congratulations to the entire team of #BethlehemKudumbaUnit on achieving INDUSTRY HIT status in Malayalam ❤️🔥A truly deserving feat for a film that gave us one of the most beautiful cinematic experiences in recent times ❤️@BhavanaStudios, Fahadh garu congratulations on backing… pic.twitter.com/Gx3xaGR4d8— Mythri Movie Makers (@MythriOfficial) September 14, 2026 -
‘బెత్లెహోమ్ కుటుంబ యూనిట్’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్!
టైటిల్: బెత్లెహోమ్ కుటుంబ యూనిట్నటీనటులు: నివిన్ పౌలి, మమిత బైజు, సంగీత్ ప్రతాప్, సురేశ్ కృష్ణ, వినయ్ ఫోర్ట్, రోషన్ షానవాస్ తదితరులునిర్మాతలు: దిలీష్ పోతన్, ఫహద్, ఫాజిల్, శ్యామ్ పుష్కరన్ తెలుగు విడుదల: మైత్రీ మూవీ రిలీజ్దర్శకత్వం: గిరీశ్ ఏడీసంగీత: విష్ణు విజయ్సినిమాటోగ్రాఫర్: అజ్మల్ సాబువిడుదల తేది: సెప్టెంబర్ 4, 2026మలయాళ సినిమాలకు తెలుగులో మంచి ఆదరణ ఉంటుంది. అందుకే ఈ మధ్య అక్కడ సినిమాలన్నీ ఇక్కడ కూడా రిలీజ్ చేస్తున్నారు. అలా ఈ వారం తెలుగులో రిలీజ్ అయిన మలయాళ చిత్రమే ‘బెత్లెహోమ్ కుటుంబ యూనిట్’. ఓనమ్ పండగ సందర్భంగా ఆగస్టు 21న మలయాళంలో రిలీజ్ అయిన ఈ చిత్రం అక్కడ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా రూ. 200 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. నేడు(సెప్టెంబర్ 4) ఈ మూవీ తెలుగు వెర్షన్ రిలీజ్ అయింది. ‘ప్రేమలు’ఫేమ్ గిరీశ్ ఏడీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను ఏమేరకు ఆట్టుకుందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. జస్టిన్ (నివిన్ పౌలీ) ఊర్లో క్యాటరింగ్ బిజినెస్ రన్ చేస్తుంటాడు. 30 ఏళ్లు దాటినా పెళ్లి చేసుకోలేదు. ఊర్లో వాళ్లంతా హేళన చేస్తున్న పెద్దగా పట్టించుకోడు. అలాంటి వ్యక్తిని పక్కింట్లోకి కొత్తగా వచ్చిన ఓ కుటుంబంలోని అమ్మాయి ఆష్లే(మమితా బైజు) ప్రేమిస్తుంది. తొలుత స్నేహం చేసి ఆ తర్వాత అతని మంచితనం చూసి ప్రేమలో పడిపోతుంది. అయితే ఆమెకు జస్టిన్‌కి మధ్య 13 ఏళ్ల వయసు వ్యత్యాసం ఉంటుంది. కాలేజీకి వెళ్లే అమ్మాయి ఆష్లే తనను ప్రేమించిందన్న విషయం తెలిసి జస్టిన్ కూడా ఆమెను ప్రేమించడం మొదలు పెడతాడు. ప్రేమ విషయం కొన్నాళ్లు సీక్రెట్‌గా ఉంచుదామని చెప్పి..ఎవరి కంటా పడకుండా తిరుగుతుంటారు. అయితే ఓ సంఘటన వీరి రహస్య ప్రేమ వ్యవహారం ఇరు కుటుంబాలకు తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? ఇద్దరి కుటుంబ సభ్యలు ఎలా రియాక్ట్ అయ్యారు? చివరకు వీరిద్దరి ప్రేమ..పెళ్లి వరకు ఎలా వెళ్లింది? ఈ క్రమంలో ఎదురైన సవాళ్లు ఏంటి? వాటిని ఎలా ఎదుర్కొన్నారు? అనేదే ఈ సినిమా కథ.ఎలా ఉందంటే.. చారానా కోడికి బారానా మసాలా అన్నట్లుగా.. చిన్న కథకు కూడా కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టి, భారీ హంగులతో సినిమాలు తెరకెక్కిస్తున్న రోజులివి. కానీ సినిమా గొప్పదనం ఎన్ని కోట్లు ఖర్చు చేశామన్నదానిలో లేదు.. తెరపై ఆ కథను ఎంత సహజంగా ఆవిష్కరించామన్నదానిలో ఉంటుంది. ప్రేక్షకుడు కథతో కనెక్ట్ అవ్వాలి.. పాత్రల్లో తనను తాను చూసుకోవాలి.. అప్పుడే ఆ సినిమా బడ్జెట్‌తో సంబంధం లేకుండా విజయం సాధిస్తుంది. ఈ సూత్రాన్ని మలయాళ చిత్ర పరిశ్రమ ఎప్పుడో ఒంటబట్టించుకుంది. స్టార్ హీరోలు, భారీ సెట్లు, కోట్ల బడ్జెట్ల కంటే.. కథ, కథనానికే అక్కడ పెద్దపీట. అందుకే అక్కడి నుంచి వచ్చే సినిమాలు భాషల్ని దాటి ప్రేక్షకుల మనసుల్లోకి వెళ్తుంటాయి. అలాంటి సహజత్వానికి అద్దం పట్టే మరో మలయాళ ఆణిముత్యమే ‘బెత్లెహోమ్ కుటుంబ యూనిట్’ సినిమా. ఈ సినిమా కథ కొత్తదేమి కాదు. చాలా సింపుల్ లవ్ స్టోరీ. ఏజ్ డిఫరెన్స్ కాన్సెప్ట్‌తో వచ్చిన సింపుల్ లవ్‌స్టోరీ.కథలో కొత్తదనమేమి లేకున్నా..దాన్ని తెరపై కొత్తగా చూపించడంలో మాత్రం దర్శకుడు గిరీశ్ వందశాతం సక్సెస్ అయ్యాడు. ప్రేమలు సినిమా మాదిరే ఇందులో కూడా సహజత్వానికి పెద్ద పీట వేశాడు దర్శకుడు. సినిమా ప్రారంభం నుంచి ఎండ్ వరకు ప్రతి సన్నివేశం రియాలిటీకి దగ్గరగా ఉంటుంది. ఎక్కడ బోర్ కొట్టకుండా ఆద్యంతం ఆహ్లాదకరంగా కథనం సాగుతుంది. ప్రారంభం కాస్త నెమ్మదిగా సాగినా..జస్టిన్, ఆష్లే పరిచయం తర్వాత మనం ఆ పాత్రలతో కలిసి ప్రయాణం చేస్తుంటాం. హీరోహీరోయిన్ల పరిచయం..స్నేహితుల మాటలు.. లవ్ ప్రపోజల్.. ప్రతీది మన చుట్టుపక్కల చూసిన కథనే తెరపై చూపించిన అనుభూతి కలుగుతుంది. షార్ట్‌ఫిల్మ్ మేకింగ్‌తో జస్టిన్ తమ్ముడు రచ్చ నవ్వులు పూయిస్తుంది. ఆష్లే లవ్ ప్రపోజల్ సీన్ కూడా ఆకట్టుకుటుంది. ఇక సెకండాఫ్ మొత్తం హీరో హీరోయిన్ల లవ్ చుట్టునే తిరుగుతుంది. ఊర్లో వాళ్లుకి, స్నేహితులకు తెలియకుండా రహస్యంగా కలుసుకోవడం.. చిన్న చిన్న గొడవలు..అలకలు.. కాలేజీ ఎపిసోడ్.. అన్ని ఆకట్టుకుంటాయి. ఇక వీరిద్దరి ప్రేమ విషయం ఇంట్లో తెలిసిన తర్వాత అసలు సంఘర్షణ మొదలవుతుంది. అయితే అక్కడ నుంచి కథను ఎమోషనల్‌గా నడిపించే అవకాశం ఉన్నప్పటికీ దర్శకుడు మళ్లీ హాస్యాన్నే ఎంచుకున్నాడు. తన తమ్ముడి లవ్‌స్టోరీ తెలిసిన తర్వాత.. ఆ జంటను కలిపేందుకు జస్టిన్ గ్యాంగ్ చేసే హంగామా అంతా నవ్వులు పూయిస్తుంది. ఎమోషనల్ సీన్స్ ఉన్నప్పటికీ... అటు వైపు ఎక్కువ వెళ్ళలేదు. అలాగే హీరో లవ్ఫెయిల్యూర్ని పైపైనా చూపిస్తూ .. అతని తమ్ముడి లవ్‌స్టోరిని హైలెట్ చేస్తూ హాస్యం పండించాడు. హీరోహీరోయిన్ల ప్రేమలో డెప్త్ లేకున్నా.. కామెడీ సీన్లతో ఆలోటుని పూడ్చేశాడు. క్లైమాక్స్ కొంత సాగదీతగా అనిపిస్తుంది. ఓవరాల్‌గా మాత్రం ఓ మంచి సినిమా చూశామనే ఫిలింగ్ కలుగుతుంది. ఎవరెలా చేశారంటే.. నివిన్ పౌలీ పాత్రలో నివిన్ పౌలీ నటించలేదు..జీవించేశాడని చెప్పాలి.తెరపై హీరోలా కాకుండా కామన్ మ్యాన్‌గా కనిపించాడు. ముఖ్యంగా హీరోయిన్ ప్రపోజ్ చేసినప్పుటు ఆయన ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ చాలా సహజంగా ఉంటాయి. తన ప్రేమను వ్యక్తం పరిచేందుకు పడే సిగ్గు, ఇన్ సెక్యూరిటీ.. ప్రతీది చాలా అద్భుతంగా పండించాడు. ఇక ఆష్ల పాత్రలో పరకాయ ప్రవేశం చేసింది మమిత. ఆమె పాత్రను తీర్చిదిద్దిన విధానం చాలా బాగుంది.నివిన్, మమితల ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ చాలా బాగా వర్కౌట్ అయింది. హీరో తమ్ముడిగా సంగీత్ ప్రతాప్, అతని స్నేహితుడిగా రోషన్ షనవాస్ తమదైన కామెడీతో నవ్వించారు. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా చాలా బాగుంది. విష్ణు విజయ్ సంగీతం ఈ సినిమాకు మరో ప్రధాన బలం. తనదైన బీజీఎంతో సినిమా స్థాయిని పెంచేశాడు. పాటలు కూడా బాగుంటాయి. అజ్మల్ సాబు సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. కేరళ పల్లెటూరి అందాలనే కాదు గోవా అందాలను కూడా తెరపై అద్భుతంగా చూపించాడు. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్


