చిన్న సినిమా.. సరికొత్త బాక్సాఫీస్ రికార్డ్..! | Bethlehem Kudumba Unit is highest-grossing Malayalam film now | Sakshi
Sakshi News home page

Bethlehem Kudumba Unit: చిన్న సినిమా.. సరికొత్త బాక్సాఫీస్ రికార్డ్..!

Sep 14 2026 4:49 PM | Updated on Sep 14 2026 4:49 PM

Bethlehem Kudumba Unit is highest-grossing Malayalam film now

చిన్న సినిమా అయినా సరే కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. భారీ తారాగణం, బడ్జెట్‌ లేకపోయినా బాక్సాఫీస్ వద్ద చిన్న చిత్రాలు సైతం అదరగొడుతున్నాయి. ఇటీవలే రవితేజ హీరోగా వచ్చిన ఇరుముడి కేవలం మౌత్‌ టాక్‌తోనే సూపర్‌ హిట్‌గా నిలిచింది. అలా మరో సినిమా సైతం కోట్లు కొల్లగొట్టింది. మలయాళంలో రిలీజైన బెత్లెహెం కుటుంబ యూనిట్ అనే మూవీ సరికొత్త చరిత్ర సృష్టించింది.

తాజాగా  ఈ మూవీ అరుదైన ఘనత సాధించింది. గిరీష్ ఏడీ దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ కామెడీ కేవలం 24 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.304.9 కోట్లు వసూలు చేసింది. ఈ కలెక్షన్లతో మలయాళంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డ్ సృష్టించింది. గతంలో సూపర్ హిట్‌గా నిలిచిన కొత్త లోకా(రూ.302 కోట్లు) వసూళ్లును ఈ మూవీ దాటేసింది. దీంతో మలయాళ బాక్సాఫీస్ వద్ద అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది బెత్లెహెం కుటుంబ యూనిట్.

కాగా.. ఈ చిత్రంలో నివిన్ పౌలీ, మమితా బైజు కీలక పాత్రల్లో నటించారు. మలయాళంలో సూపర్ హిట్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని తెలుగులోనూ రిలీజ్ చేశారు. ఈ ఏడాది థియేటర్లలో భారీ విజయం సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ఈ చిత్రాన్ని భావన స్టూడియోస్ బ్యానర్‌లో  ఫహద్ ఫాసిల్, దిలీష్ పోతన్, శ్యామ్ పుష్కరన్ నిర్మించారు. ఈ సినిమాలో సంగీత్ ప్రతాప్, శ్యామ్ మోహన్, వినయ్ ఫోర్ట్, సురేష్ కృష్ణ, బిందు పనికర్, శ్రీంద కీలక పాత్రలు పోషించారు.

 

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement