టాలీవుడ్‌లో ఇప్పుడు ఎక్కడ చూసినా ‘ది ప్యారడైజ్’ గురించే చర్చ జరుగుతోంది. నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌పై మొదటి నుంచే భారీ అంచనాలు ఉండగా.. ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, టీజర్ ఆ అంచనాలను మరింత పెంచాయి. ముఖ్యంగా ఇప్పటివరకు వచ్చిన ప్రతి అప్‌డేట్ సినిమాపై ఆసక్తిని పెంచడంతో.. ‘ది ప్యారడైజ్’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రేజ్ ఇప్పుడు ఓవర్సీస్ మార్కెట్‌లోనూ కనిపిస్తోంది. సినిమా విడుదలకు ఇంకా సమయం ఉండగానే నార్త్ అమెరికా బాక్సాఫీస్ వద్ద ‘ది ప్యారడైజ్’ దూకుడు మొదలైంది.
నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ది ప్యారడైజ్’ చిత్రానికి నార్త్ అమెరికాలో భారీ స్పందన లభిస్తోంది. ప్రముఖ ఓవర్సీస్ పంపిణీ సంస్థ ప్రత్యంగిరా సినిమాస్ ద్వారా సెప్టెంబర్ 23న నార్త్ అమెరికా ప్రీమియర్ షోలు గ్రాండ్‌గా ప్రదర్శించనున్నారు. ఈ ప్రీమియర్ షోల అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే జోరందుకున్నాయి.
తాజాగా నార్త్ అమెరికా అడ్వాన్స్ బుకింగ్స్‌లో ‘ది ప్యారడైజ్’ 250K డాలర్ల మార్క్‌ను దాటినట్లు మేకర్స్ వెల్లడించారు. దీంతో సినిమా విడుదలకు ముందే ఓవర్సీస్‌లో తన సత్తా చాటుతోంది. అడ్వాన్స్ బుకింగ్స్‌కు వస్తున్న స్పందన చూస్తుంటే.. ప్రీమియర్ షోల సమయానికి ఈ నంబర్ మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.
ఇక ‘ది ప్యారడైజ్’పై నాని అభిమానులతో పాటు సినీ ప్రియుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో గతంలో వచ్చిన ‘దసరా’కు మంచి స్పందన లభించిన నేపథ్యంలో.. ఈసారి వీరిద్దరూ ఎలాంటి కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారనే ఆసక్తి నెలకొంది. తాజాగా విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కూడా సినిమాపై హైప్‌ను మరింత పెంచింది.
మొత్తానికి.. థియేటర్లలోకి రాకముందే ‘ది ప్యారడైజ్’ ఓవర్సీస్‌లో రికార్డుల వేట మొదలుపెట్టింది. నార్త్ అమెరికా ప్రీమియర్స్‌కు ఇంకా సమయం ఉండటంతో అడ్వాన్స్ బుకింగ్స్ ఏ స్థాయికి చేరుకుంటాయనేది ఆసక్తికరంగా మారింది.
#ThePARADISE North America PREMIERES PRE-SALES $250K and Counting 💥
Bookings Open Now 🎟️
Overseas By @PrathyangiraUS , Premieres On SEPTEMBER 23 👊@NameisNani @Odela_Srikanth @AnirudhOfficial @SudhakarCheruk5 @SLVCinemasOffl @TheParadiseOffl pic.twitter.com/50lUAYqiTr— Vamsi Kaka (@vamsikaka) September 14, 2026


