‘అమ్మవారి’పై నయనతార భారీ ఆశలు | Nayanthara Interesting Comments On Mookuthi Amman 2 Movie | Sakshi
Sakshi News home page

‘అమ్మవారి’పై నయనతార భారీ ఆశలు

Sep 14 2026 9:57 AM | Updated on Sep 14 2026 10:02 AM

Nayanthara Interesting Comments On Mookuthi Amman 2 Movie

 ఇంతకు ముందు నటి నయనతార ప్రధాన పాత్రల్లో దర్శకుడు ఆర్‌జే.బాలాజీ తెరకెక్కించిన సోషియల్‌ డివోషన్‌ కథా చిత్రం మూక్కుత్తి అమ్మన్‌. 2020లో విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. కాగా తాజాగా ఆ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతున్న చిత్రం మూక్తుత్తి అమ్మన్‌ 2. ఐసరి గణేశన్‌కు చెందిన వేల్స్‌ ఫిలిం ఇంటర్నేషనల్‌ సంస్థ, నయనతారకు చెందిన రౌడీ పిక్చర్స్‌ సంస్థ కలిసి నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి సుందర్‌.సీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులోనే టైటిల్‌ పాత్రను నటి నయనతార పోషిస్తున్నారు. నటి స్నేహా, రెజీనా, ఊర్వశి, అభినయ,ఇనియ, మైనా నందిని, యోగిబాబు, దునియా విజయ్‌, రామచంద్రరాజు, అజయ్‌ గోష్‌, సింగంపులి, విచ్చు విశ్వనాథ్‌ తదితరులు ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు.దీనికి హిప్‌హాప్‌ తమిళా సంగీతాన్ని అందిస్తున్నారు. 

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 24 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)

ఈ చిత్రంపై నటి నయనతార చాలా నమ్మకాన్ని పేట్టుకున్నారు. ఇటీ వల ఒక బేటీలో ఆమె పేర్కొంటూ మూక్కుత్తి అమ్మన్‌– 2 చిత్రం తన కెరీర్‌లో చాలా ముఖ్యమైన కథా చిత్రం అని, మైలు రాయిగా నిలిచిపోతుందనే నమ్మకాన్ని వ్యక్తిం చేశారు. చిత్రంలో భావోద్రేకాలతో కూడిన పలు ఆశ్చర్యకరమైన అంశాలు చోటు చేసుకున్నాయని పేర్కొన్నారు. దీంతో ఈ చిత్రంపై ఆసక్తి నెలకొంది. 

కాగా ఈ చిత్రంలోని మహాశక్తి అనే పల్లవితో సాగే పాటను వినాయక చవితి సందర్భంగా సోమవారం విడుదల చేయనున్నట్లు వేల్స్‌ ఫలిం ఇంటర్నేషనల్‌ సంస్థ అధినేత ఐసరిగణేశన్‌ ఎక్స్‌ వేదికగా పేర్కొన్నారు. కాగా షూటింగ్‌ను పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని దీపావళి సందర్శంగా విడుదల కు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement