‘ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ‘పిఠాపురంలో... అలా మొదలైంది’ అని ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ అన్నారు. పృథ్వీరాజ్, కేదార్ శంకర్, మణిచందన, అన్నపూర్ణమ్మ, సన్నీ అఖిల్, విరాట్, సాయి ప్రణీత్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘పిఠాపురంలో అలా మొదలైంది’. దర్శకుడు చంద్ర మహేష్ తెరకెక్కించిన ఈ సినిమా సెప్టెంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.ఈ క్రమంలో శనివారం రాత్రి హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది . ఈ కార్యక్రమంలో ప్రముఖ నటుడు సుమన్ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు.
దర్శకుడు మహేష్ చంద్ర మాట్లాడుతూ .. ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాకి మనసుతో పాటు ప్రాణం పెట్టి పని చేశాను. మూవీ అద్భుతంగా వచ్చింది. ఈ జర్నీలో సపోర్ట్ చేసిన నా ఆర్టిస్టులందరికీ థాంక్స్. ప్రతీ ఒక్కరూ తమ తమ పాత్రల్లో జీవించేశారు. సినిమా బాగా వచ్చింది’ అని తెలిపారు. సుమన్ మాట్లాడుతూ .. చంద్ర మహేష్‌తో నాకు 25 ఏళ్లకు పైగా అనుబంధం ఉందన్నారు. ఈ సినిమా మంచి విజయం సాధించాలన్నారు.
‘ఈ సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడూ పది మందికి గొప్పగా చెబుతాడు. మై హార్ట్ ఫెల్ట్ థాంక్స్ టు చంద్రమహేష్. క్లైమాక్స్ సీన్లో ఆర్టిస్టులు కూడా కన్నీరు పెట్టుకున్నారు. ఒక సీనియర్ నటుడుగా మీ అందరికీ చెబుతున్నా.. మంచి సినిమాని థియేటర్‌కి వెళ్లి చూడండి’ అని రాజేంద్రప్రసాద్ అన్నారు.


