'సైమా'లో మిరాయ్, సంక్రాంతికి వస్తున్నాం డామినేషన్ | SIIMA 2026 Telugu Movie Awards Full List | Sakshi
Sakshi News home page

SIIMA 2026: ఉత్తమ నటుడు తేజ.. ఉత్తమ నటి ఐ‍శ్వర్యా రాజేశ్

Sep 13 2026 3:22 PM | Updated on Sep 13 2026 3:26 PM

SIIMA 2026 Telugu Movie Awards Full List

2026 సంవత్సరానికిగానూ సైమా అవార్డ్స్ వేడుక.. బెంగళూరులో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు దక్షిణాది సినీ తారలు హాజరై సందడి చేశారు. రెండు రోజులు జరిగే ఈ కార్యక్రమంలో భాగంగా తొలిరోజు తెలుగు, కన్నడ చిత్రాల్లో ఉత్తమ ప్రతిభ చూపించిన నటీనటులు, సాంకేతిక నిపుణులు అవార్డ్స్ అందుకున్నాడు. అయితే తెలుగు నుంచి మిరాయ్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు ఫుల్ డామినేషన్ చూపించాయి.

(ఇదీ చదవండి: థియేటర్లలో ఉండగానే ఓటీటీకి 'ఇరుముడి'.. అధికారిక ప్రకటన)

‘మిరాయ్‌’లో నటనకుగానూ తేజ సజ్జా ఉత్తమ నటుడి అవార్డ్ అందుకున్నాడు. ఉత్తమ నటి (క్రిటిక్స్‌) అవార్డుని ‘సంక్రాంతికి వస్తున్నాం’లో చేసిన ఐశ్వర్య రాజేశ్‌ దక్కించుకుంది. ఉత్తమ దర్శకుడిగా అనిల్‌ రావిపూడి (సంక్రాంతికి వస్తున్నాం), ఉత్తమ హాస్యనటుడిగా బుల్లిరాజు రేవంత్ నిలిచారు. ‘కాంతార: చాప్టర్‌1’లో నటనకుగానూ రిషబ్‌శెట్టి ఉత్తమ నటుడి అవార్డు సొంతం చేసుకున్నాడు.

  • ఉత్తమ నటుడు - తేజ సజ్జా (మిరాయ్‌)

  • ఉత్తమ నటి - ఐశ్వర్య రాజేశ్‌ (సంక్రాంతికి వస్తున్నాం)

  • ఉత్తమ దర్శకుడు - అనిల్‌ రావిపూడి (సంక్రాంతికి వస్తున్నాం)

  • ఎంటర్‌టైనింగ్‌ ఇయర్‌ ఆఫ్‌ ది ఫిల్మ్‌ - (సంక్రాంతికి వస్తున్నాం)

  • బెస్ట్‌ ఎంటర్‌టైనర్‌ - వెంకటేశ్‌ (సంక్రాంతికి వస్తున్నాం)

  • ఉత్తమ సహాయ నటుడు - సత్యదేవ్‌ (కింగ్డమ్‌)

  • ఉత్తమ సహాయ నటి - శ్రద్ధా శ్రీనాథ్‌ (డాకు మహారాజ్‌)

  • ఉత్తమ హాస్య నటుడు - బుల్లిరాజు (సంక్రాంతికి వస్తున్నాం)

  • ఉత్తమ సినిమాటోగ్రఫీ - కార్తిక్‌ ఘట్టమనేని (మిరాయ్‌)

  • ఉత్తమ నేపథ్య గాయకుడు - రమణ గోగుల (సంక్రాంతికి వస్తున్నాం)

  • ఉత్తమ నేపథ్య గాయని - సమీరా భరద్వాజ్‌ (కోర్ట్‌)

  • ఉత్తమ నటుడు (పరిచయ) - హర్ష్‌ రోషన్‌ (కోర్ట్‌)

  • ఉత్తమ నటి (పరిచయ) - శ్రీదేవి (కోర్ట్‌)

  • ఉత్తమ నటి (పరిచయ) - సాక్షి మడోల్కర్ (మోగ్లీ)

  • ఉత్తమ గేయ రచయిత - పూర్ణా చారి (కోర్ట్‌)

(ఇదీ చదవండి: ముకేశ్ చాలా ఇష్టం.. కానీ చెప్పలేకపోతున్నా: దేబ్జానీ)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement