బాలనటుడిగా అందరి ప్రశంసలు పొంది ‘జాంబీ రెడ్డి’తో హీరోగా పరిచయమయ్యాడు తేజ సజ్జా. నేడు (శనివారం) అతని పుట్టినరోజు కావడంతో పీపుల్స్ మీడియా అభిమానులకు ఆసక్తికరమైన అప్‌డేట్‌ను అందించింది. ‘జాంబీ రెడ్డి నెక్ట్స్ లెవల్’ అంటూ ‘జాంబీ రెడ్డి’కి సీక్వెల్ రోబోతోందటూ ప్రకటించింది. ఈ సినిమాలో ఉపేంద్ర కీలక పాత్ర పోషిస్తున్నారని తెలుస్తోంది.
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా వచ్చిన సినిమా ‘జాంబీ రెడ్డి’. 2021లో విడుదలైన ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ‘జాంబీ రెడ్డి2’ కు సుపర్ణ్ ఎస్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. గౌర హరి సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ మూవీ 2027లో ప్రేక్షకులను పలకరించనుంది. తెలుగు, తమిళం, హిందీ, తదితర భాషల్లో విడుదల కానుంది.


