రవితేజ ఇరుముడిపై యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ప్రశంసలు కురిపించారు. ఈ మూవీ ప్రత్యేకమని ఆయన కొనియాడారు. ఈ సినిమా మీ అంతరాత్మను చాలా లోతుగా టచ్ చేస్తుందని తెలిపారు. ఈ కథ ఒక స్వచ్ఛమైన భావోద్వేగం, భక్తితో జరుపుకునే వేడుక అని అంటూ సందీప్ రెడ్డి ప్రశంసించారు. మాస్ మహారాజా రవి తేజ, బేబీ నక్షత్ర, శివ నిర్వాణ మనల్ని ఒక మరపురాని భావోద్వేగ ప్రయాణంలోకి తీసుకు వెళ్తారని ట్వీట్ చేశారు. ఈ మూవీ తప్పకుండా చూడాలని అభిమానులను కోరారు. సూపర్ హిట్ సాధించిన చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు.
రవితేజ హీరోగా వచ్చిన లేటేస్ట్ మూవీ ఇరుముడి. శివ నిర్వాణ డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం ఆగస్టు 21న థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రానికి తొలి షో నుంచే పాజిటివ్ టాక్ వస్తోంది. దీంతో మాస్ మహారాజా రవితేజ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. ఓ థియేటర్లో ఏకంగా మల్లెపూల సాంగ్ వచ్చినప్పుడు హారతులు కూడా పట్టారు. కాగా..ఈ సినిమాకు జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతమందించారు.
It’s a pure celebration of EMOTION and DEVOTION. 🔥
MASS MAHARAJA RAVI TEJA sir, BABY NAKSHATRA & SIVA NIRVANA take us on a unforgettable emotional ride. ❤️
IRUMUDI is truly one of a kind for this generation, a film that touches something deep within you and stays with you even…— Sandeep Reddy Vanga (@imvangasandeep) August 21, 2026


