‘కౌన్ బనేగా కరోడ్‌పతి-18’లో ఐఐటీ బాంబే టాపర్ యోగేశ్ సాహు రూ.50 లక్షలు గెలుచుకున్నారు. ఆగస్టు 19న ప్రసారమైన ఎపిసోడ్‌లో హాట్‌సీట్‌పై కూర్చున్న 23 ఏళ్ల యోగేశ్.. రూ.కోటి ప్రశ్న వద్ద తడబడ్డారు. అన్ని లైఫ్‌లైన్లు పూర్తవడంతో ఎలిమినేషన్ పద్ధతిని ఉపయోగించినా సరైన సమాధానాన్ని గుర్తించలేకపోయారు. దీంతో రూ.50 లక్షలతో ఆటను ముగించారు.
ఇంతకీ ఆ రూ.కోటి ప్రశ్న ఏంటి?
ప్రశ్న: 1943లో ముంబయిలోని మహాలక్ష్మి రేస్‌కోర్స్‌లో జరిగిన తొలి ఇండియన్ డెర్బీలో విజేతగా నిలిచిన బరోడా మహారాజుకు చెందిన గుర్రం ఏది?
A) ప్రిన్సెస్ బ్యూటిఫుల్
B) రీగల్ డొమైన్
C) స్టార్ ఆఫ్ గ్వాలియర్
D) ప్రిన్స్ ప్రదీప్.
సరైన సమాధానం.. ప్రిన్సెస్ బ్యూటిఫుల్
ప్రిన్సెస్ బ్యూటిఫుల్. 1943 జనవరి 30న ముంబైలోని మహాలక్ష్మి రేస్‌కోర్స్‌లో జరిగిన తొలి ఇండియన్ డెర్బీలో ఆమె విజేతగా నిలిచింది. బరోడా మహారాజు గైక్వాడ్‌కు చెందిన ప్రిన్సెస్ బ్యూటిఫుల్‌కు ఎం.సి. పటేల్ శిక్షణ ఇచ్చారు. ఆస్ట్రేలియన్ జాకీ ఎడ్గర్ బ్రిట్ స్వారీ చేశారు. ఆ ఏడాది ప్రిన్సెస్ బ్యూటిఫుల్ ఇండియన్ 1000 గినీస్, ఇండియన్ 2000 గినీస్ రేసుల్లోనూ విజయం సాధించింది. తొలి ఇండియన్ డెర్బీ విజేతకు అప్పట్లో రూ.35 వేల ప్రైజ్‌మనీ అందించారు. ఎనిమిది దశాబ్దాలు దాటినా ఈ రేసు భారత గుర్రపు పందేల చరిత్రలో ప్రముఖ ఈవెంట్‌గా కొనసాగుతోంది.
ఇదీ చదవండి: ‘ఇరుముడి’కి అదిరిపోయే ఓపెనింగ్.. తొలిరోజు కలెక్షన్లు ఇవే


