సినీ రంగంలో రాణించాలనుకునే వారికి గ్రామీణ నేపథ్యం అడ్డం కాదని నిరూపిస్తున్నారు కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం భద్రవరం గ్రామానికి చెందిన కసిరెడ్డి రాజ్‌కుమార్. సంగీత దర్శకుడిగా ఎదగాలనే ఆశయంతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఆయన అనూహ్యంగా కమీడియన్‌గా, సహాయ నటుడిగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. మండలంలోని ధర్మవరంలో ఓ వివాహ వేడుకలో పాల్గొన్న రాజ్‌కుమార్ ‘సాక్షి’ ముచ్చటించింది.
సినీరంగ ప్రవేశం ఎలా జరిగింది?
రాజ్‌కుమార్: మా తాతగారు యాళ్ల మాణిక్యం (తిక్కరాజు) హార్మోని ఆర్టిస్ట్. ఆయన స్ఫూర్తితో మ్యూజిక్ డైరెక్టర్ కావాలని సినీ రంగానికి వెళ్లాను. కానీ నటుడిగా అవకాశాలు రావడంతో ఆ దిశగా నా ప్రయాణం మళ్లింది.
తొలి సినిమా?
రాజ్‌కుమార్: 2017లో ‘రాజావారు రాణివారు’ ఆ తరువాత 15 చిత్రాల్లో నటించాను.
గుర్తింపు తెచ్చిన సినిమాలు?
రాజ్‌కుమార్: ‘లక్కీ భాస్కర్’, ‘ఆయ్’, ‘బెదురులంక’, ‘రంగా రంగా వైభవంగా’, ‘అర్జున ఫల్గుణ’.
ఇరుముడిలో అనుభవం?
రాజ్‌కుమార్: రవితేజ నటించిన ‘ఇరుముడి’ చిత్రంలో భూషణం పాత్రలో చేశాను.
ప్రముఖ హీరోల చిత్రాల్లో నటించారా?
రాజ్‌కుమార్: ‘ఆకాశంలో ఒక తార’ చిత్రంతో పాటు దుల్కర్ సల్మాన్ చిత్రంలో నటిస్తున్నారు.
ప్రస్తుతం ఎన్ని సినిమాలు చేస్తున్నారు?
రాజ్‌కుమార్: ప్రస్తుతం ‘రౌడీ జనార్ధన్’, ‘డాన్ బాస్కో’ తదితర ఎనిమిది సినిమాల్లో నటిస్తున్నాను. ప్రేక్షకులకు గుర్తుండే పాత్రలు చేయాలని ప్రయత్నిస్తున్నాను.
భవిష్యత్ లక్ష్యాలు?
రాజ్‌కుమార్: నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకోవాలి. విభిన్న పాత్రలతో ప్రేక్షకులను మెప్పించాలి.


