టాలీవుడ్ నటి ఇంద్రజ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఒక సినిమాలో తాను నటించాక ఈవెంట్‌కు రావడం తన బాధ్యత అని అన్నారు. అందుకే ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు కచ్చితంగా హాజరవుతానని ఆమె తెలిపారు. ఒక సినిమాలో యాక్ట్ చేసినప్పుడు అది నా బాధ్యతని వెల్లడించారు. అనకాపల్లి మూవీ సక్సెస్ మీట్‌కు హాజరైన ఆమె మాట్లాడారు.
అలా అయితే రాను..
ఏదైనా సక్సెస్ సాధించాక నిర్వహిస్తేనే తాను ఈవెంట్‌కు హాజరవుతానని ఇంద్రజ తెలిపారు. అయితే ఒక సినిమా నిజంగా విజయం సాధిస్తేనే తాను ఈవెంట్‌కు వస్తానని స్పష్టం చేశారు. మూవీ సక్సెస్ కాకపోయినా.. సక్సెస్ మీట్ నిర్వహిస్తే తాను మాత్రం వెళ్లనని తేల్చిచెప్పారు. ప్రస్తుతం ఇంద్రజ చేసిన కామెంట్స్ టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారాయి. నిజంగా మూవీ హిట్ అయితేనే సక్సెస్ మీట్ నిర్వహించాలని ఆమె చెప్పడం మంచి విషయమేనని కొందరు నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
(ఇది చదవండి: నభా నటేశ్ లవ్ ఎంటర్‌టైనర్.. టైటిల్ ఖరారు)


