గోవా వేదికగా 57వ ఇఫీ (ఇంటర్‌నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా) వేడుకలు ఈ నెల 20న ప్రారంభమైన సంగతి తెలిసిందే. శనివారం (నవంబరు 21) ‘భక్త కన్నప్ప’ సినిమా ఈ వేడుకల్లో ప్రదర్శితమైంది. బాపు దర్శకత్వంలో కృష్ణంరాజు ప్రధాన పాత్రధారిగా, బాలయ్య, వాణిశ్రీ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా 1976 మే 26న విడుదలై, బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాకు 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ‘ఇఫీ’లో ‘గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్’ విభాగంలో ‘భక్త కన్నప్ప’ను ప్రదర్శించారు.
ఈ విషయంపై ప్రభాస్ స్పందించారు. ‘‘ఈ సినిమా చూస్తూ పెరిగాను. గోపీకృష్ణా మూవీస్ నిర్మించిన ఈ సినిమాలో పెదనాన్నగారు (కృష్ణంరాజు) నటించారు. బాపుగారు ఈ సినిమాకు ్రపాణం పోశారు. సంవత్సరాలు గడిచినా కొన్ని సినిమాలు ఎప్పటికీ నిలిచే ఉంటాయి. ‘ఇఫీ’ వేడుకల్లో ‘భక్త కన్నప్ప’ ప్రదర్శితం కావడం నిజమైన గౌరవం’’ అంటూ ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ చేశారు ప్రభాస్. ఇదిలా ఉంటే... ఆమిర్ ఖాన్ ‘లగాన్ ’ విడుదలై, పాతికేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ సినిమా ప్రత్యేక ప్రదర్శన జరిగింది. ‘ఇఫీ’ వేడుకలు ఈ నెల 28 వరకు జరగనున్నాయి.


