సినిమాను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లేందుకు హీరోలు కొత్త కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు. వినూత్న ప్రచార కార్యక్రమాలతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. తాజాగా నటుడు విజయ్ ఆంటోనీ కూడా తన సినిమా కోసం ఇలాంటి ప్రయత్నమే చేశారు. సాధారణ ప్రయాణికుడిలా రైలులో ప్రయాణిస్తూ తన సినిమాను ప్రమోట్ చేశారు.
సామాన్య ప్రయాణికుడిలా
‘బిచ్చగాడు’, ‘బిచ్చగాడు 2’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన విజయ్ ఆంటోనీ.. తాజాగా ‘అప్పాకుట్టి’ చిత్రంలో నటించారు. ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే సినిమాను మరింతగా జనాల్లోకి తీసుకెళ్లేందుకు ఆయన వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టారు. తన బృందంతో కలిసి చెన్నై నుంచి కోయంబత్తూర్ వెళ్లే కోవై ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించారు.
ఈ సందర్భంగా సాధారణ వ్యక్తిలా జనరల్ బోగీలో తోటి ప్రయాణికులతో ముచ్చటించారు. తన సినిమా విశేషాలను వారితో పంచుకున్నారు. విజయ్ ఆంటోనీ ఇలా సామాన్య ప్రయాణికుడిలా రైలులో కనిపించడంతో పలువురు ఆశ్చర్యపోయారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
(ఇదీ చదవండి: నేను ఒక్కరితోనే ప్రేమలో ఉన్నా: కీర్తి సురేశ్)
Vijay Antony travelled in an unreserved coach 🤯 https://t.co/ftMkQYOHp8
— Ayyappan (@Ayyappan_1504) November 21, 2026


