నటి కీర్తి సురేశ్ తన వ్యక్తిగత జీవితంపై వచ్చిన రూమర్స్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీలో పలువురు నటులతో తనకు సంబంధాలు ఉన్నాయంటూ గతంలో ప్రచారం జరిగినప్పుడు బాధపడినట్లు తెలిపారు. తాజాగా తన చిత్రం ‘సత్యవాన్ సావిత్రి’ ప్రచారంలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో భర్త ఆంటోనీ తటిల్‌తో తన అనుబంధం, రూమర్స్‌పై స్పందించారు.
ఆ వార్తలు నన్ను బాధించేవి
‘ఇండస్ట్రీలో నటులతో నాకు సంబంధాలు ఉన్నాయంటూ వచ్చే వార్తలు నన్ను బాధించేవి. ఎందుకంటే ఇప్పటివరకు నేను ఒక్కరితోనే ప్రేమలో ఉన్నాను. అది కూడా ఆంటోనీతోనే. ఈ రూమర్స్‌పై ఏమైనా స్పందించాలా? అని ఆంటోనీ నన్ను అడిగేవాడు. కానీ అంతకుమించి ఎప్పుడూ నన్ను ప్రశ్నించలేదు. మా ఇద్దరికీ ఎలాంటి అభ్యంతరం లేనప్పుడు.. నేను ఎవరికో నిరూపించుకోవాల్సిన అవసరం కూడా లేదు. అందుకే అలాంటి వార్తలను పట్టించుకోను’ అని కీర్తి స్పష్టం చేశారు.
15 ఏళ్ల పాటు ప్రేమలో..
‘నా భర్త ఆంటోనీ చాలా మంచి వాడు. నా కెరీర్‌కు ఆయన ఎంతో మద్దతుగా నిలుస్తుంటారు. నేను నిరాశలో ఉన్నప్పుడు ధైర్యం చెబుతూ, ముందుకు వెళ్లేలా ప్రోత్సహిస్తారు. ఆంటోనీకి సినిమా రంగానికి సంబంధించిన హడావుడి, ప్రచార కార్యక్రమాలు పెద్దగా ఇష్టం ఉండవు. అందుకే ఆయనను ఇబ్బందికర పరిస్థితుల్లోకి తీసుకెళ్లాలని అనుకోను’ అని తెలిపారు. కాగా సుమారు 15 ఏళ్ల పాటు ప్రేమలో ఉన్న కీర్తి సురేశ్, ఆంటోనీ తటిల్ 2024లో వివాహ బంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే.
(ఇదీ చదవండి: గిల్ కాదట.. యంగ్ హీరోతో సారా టెండూల్కర్ పెళ్లి..?)


