జనవరి 12 విడుదల.. ‘డివికి డివికి’ ఫుల్‌ సాంగ్‌ వచ్చేసింది! | Diviki Diviki Song Released From January 12 Vidudala Movie | Sakshi
Sakshi News home page

జనవరి 12 విడుదల నుంచి ‘డివికి డివికి’.. అదిరిపోయే సాంగ్‌ రిలీజ్‌!

Nov 21 2026 12:59 PM | Updated on Nov 21 2026 1:04 PM

Diviki Diviki Song Released From January 12 Vidudala Movie

అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న క్రేజీ మల్టీస్టారర్‌ ‘జనవరి 12 విడుదల’. విక్టరీ వెంకటేశ్‌, నందమూరి కళ్యాణ్‌రామ్‌ హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్‌, కృతి శెట్టి కథానాయికలుగా కనిపించనున్నారు. షైన్‌ స్క్రీన్స్‌ బ్యానర్‌పై ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అనిల్‌ రావిపూడి తనదైన శైలిలో ప్రమోషన్స్‌ చేస్తూ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నారు. ముఖ్యంగా ఒక్కో పాటను విడుదల చేస్తూ సినిమాకు మరింత హైప్‌ తీసుకొస్తున్నారు.

(చదవండి: ‘ది రన్నర్‌’ రివ్యూ: కొడుకు కోసం అమ్మ పరుగు..క్షణం క్షణం ఉత్కంఠ)

ఈ క్రమంలో తాజాగా ‘డివికి డివికి’ అంటూ సాగే పాటను మేకర్స్‌ విడుదల చేశారు. వెంకటేశ్‌, కళ్యాణ్‌రామ్‌ కాంబినేషన్‌, అనిల్‌ రావిపూడి మార్క్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఈ పాట సినిమాపై అంచనాలను మరింత పెంచేలా ఉంది.  సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ మల్టీస్టారర్‌ సంక్రాంతి బరిలో ఎలాంటి సందడి చేస్తుందో చూడాలి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement