ఇదెక్కడి ట్విస్ట్.. హనుమాన్ సీక్వెల్లో మెగా హీరో..! | Hanuman Makers Announced Sequel Project with Mega Hero Goes Viral | Sakshi
Sakshi News home page

Hanuman Sequel: ఇదెక్కడి ట్విస్ట్.. హనుమాన్ సీక్వెల్లో మెగా హీరో..!

Nov 21 2026 12:09 PM | Updated on Nov 21 2026 12:19 PM

Hanuman Makers Announced Sequel Project with Mega Hero Goes Viral

ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో వచ్చిన బ్లాక్‌బస్టర్‌ మూవీ హనుమాన్. తేజ సజ్జా హీరోగా వచ్చిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద సూపర్‌ హిట్‌గా నిలిచింది. దీంతో ఈ మూవీకి సీక్వెల్‌ జై హనుమాన్ ఇప్పటికే ప్రకటించారు. ప్రస్తుతం సీక్వెల్‌తో ఫుల్ బిజీగా ఉన్నారు ప్రశాంత్ వర్మ. ఈ చిత్రంలో కాంతార ఫేమ్ రిషబ్ శెట్టి హనుమంతుడిగా కనిపించనున్నారు.

తాజాగా ఈ సీక్వెల్‌ తెరకెక్కుతుండగానే టాలీవుడ్‌లో మరో బిగ్‌ ప్రాజెక్ట్‌ అనౌన్స్ చేశారు. మెగా హీరో వైష్ణవ్ తేజ్ లీడ్‌ రోల్లో హనుమాన్‌- ది రైజ్ ఆఫ్ వానరాస్(హనుమాన్-2) మూవీ ప్రకటించారు. ఈ చిత్రానికి వీఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తుండగా.. ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌లో నిర్మిస్తున్నారు. దీంతో టాలీవుడ్ ఫ్యాన్స్ డైలామాలో పడ్డారు. అసలు ఇది హనుమాన్‌ ‍సీక్వెల్‌ మూవీనా?.. లేదంటే కొత్త ప్రాజెక్ట్‌ అనౌన్స్ చేశారా అనేది తెలియాల్సి ఉంది. ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో వచ్చిన హనుమాన్ నిర్మాణ సంస్థ ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఈ ప్రాజెక్ట్ ప్రకటించడం మరో విశేషం. 

(ఇది చదవండి: 'నా లైఫ్‌లో ఆనందం నువ్వే'..కూతురికి ఐకాన్ స్టార్ స్పెషల్ విషెస్)
    
అయితే అయితే పార్ట్ -1  నిర్మించిన ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ వారు కూడా ఇప్పుడు ‘హను మాన్ 2’ ని మరో హీరోతో తీసుకురాబోతున్నట్టుగా ఇటీవల రూమర్స్ గట్టిగా వినిపించాయి. తాజాగా అదే సమయంలో వాటిని నిజం చేస్తూ మేకర్స్ బిగ్ అప్‌డేట్ ఇచ్చి షాకిచ్చారు. మెగా యంగ్ హీరో పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా పెట్టి హనుమాన్- 2 ప్రీ లుక్ పోస్టర్ రిలీజ్ చేయడం  టాలీవుడ్‌లో ఆసక్తిగా మారింది.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement