ఓటీటీకి దృశ్యం-3.. అఫీషియల్ ప్రకటన | Ajay devgan Drishyam 3 Movie Ott Streaming Date announced | Sakshi
Sakshi News home page

Drishyam 3 Movie Ott: ఓటీటీకి దృశ్యం-3.. అఫీషియల్ ప్రకటన

Nov 21 2026 11:16 AM | Updated on Nov 21 2026 11:16 AM

Ajay devgan Drishyam 3 Movie Ott Streaming Date announced

అజయ్ దేవగణ్ హీరోగా వచ్చిన లేటేస్ట్ మూవీ దృశ్యం-3(ది కన్‌క్లూజన్). గతంలో రెండు పార్టులు సూపర్ హిట్ కావడంతో దృశ్యం 3: ది కంక్లూజన్ పేరుతో రిలీజ్ చేశారు. ఈ ఏడాది అక్టోబర్ 2న థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రపంచవ్యాప్తంగా రూ. 500 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ ఏడాది బాలీవుడ్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన రెండో సినిమాగా ఘనత సొంతం చేసుకుంది.

తాజాగా ఈ మూవీ ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈనెల 27 నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని అఫీషియల్‌గా ప్రకటించారు మేకర్స్. కాగా.. ఈ సినిమాకు అభిషేక్ పాఠక్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో జైదీప్ అహ్లావత్, శ్రియా సరన్, ఇషితా దత్తా, టబు, రజత్ కపూర్, ప్రకాష్ రాజ్, మృణాల్ జాదవ్ కీలక పాత్రల్లో నటించారు.  అయితే ఈ సినిమా కేవలం హిందీలో మాత్రమే స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement