బిగ్‌బాస్ రియాలిటీ షో మరో వారం ముగియనుంది. ఈ వారానికి డిక్టేటర్స్ అని పేరు పెట్టిన బిగ్‌బాస్ అందుకు తగ్గట్టుగానే కంటెస్టెంట్స్‌కు టాస్కులతో పరీక్ష పెడుతున్నారు. హౌస్‌లో రెండు టీమ్‌లుగా విభజించిన బిగ్‌బాస్ బుద్దిశాలి, బలశాలి టాస్కులో త్రిగుణ్ టీమ్ గెలుస్తుంది. కానీ హౌస్‌లో డిక్టేటర్ అయిన ముకేశ్ మాత్రం తన టీంలోని రాం ప్రసాద్‌ని గెలిచినట్టు ప్రకటిస్తాడు. దీంతో హౌస్‌మేట్స్ అంతా షాకవుతారు. తర్వాత బిగ్‌బాస్ జోక్య చేసుకోవడంతో అమన్ గెలిచాడని ప్రకటిస్తాడు.
ఈ టాస్క్‌లో గెలిచిన టీమ్‌కు బిర్యానీ.. ఓడిన వాళ్లకు గంజి భోజనంగా పెడతారు బిగ్‌బాస్. అలా నరేశ్ గంజితో అన్నం తింటుంటే రామ్ ప్రసాద్ తట్టుకోలేకపోయాడు. చిన్నపిల్లాడిలా ఏడ్చేశాడు. మేమిద్దరం బయట ఎలాంటి ఫుడ్ తినేవాళ్లమో అని గుర్తు చేసుకుంటారు. ఆ తర్వాత క్లీనింగ్ విషయంలో చిన్న గొడవ జరుగుతుంది.
ఆ తర్వాత టాస్కులు గెలిచిన త్రిగుణ్ టీం నుంచే కెప్టెన్సీ కంటెండర్లు ఉంటారని.. ఓడిన ముకేశ్ టీమ్ నుంచి ఒకరు పాల్గొనే అవకాశమిస్తాడు బిగ్ బాస్. అలా ముకేశ్ తన టీం నుంచి తనతో పాటు ఆర్కే, నీతూను ఎంపిక చేస్తాడు. అయితే త్రిగుణ్ మాత్రం కెప్టెన్సీ కంటెండర్లుగా తన టీం మెంబర్లనే పంపిస్తానంటాడు. తాను ఆడను, వెనకాల ఉంటానని చెప్తాడు.
(ఇది చదవండి: లగ్జరీ కారు కొన్న నయనతార.. ఫ్యామిలీతో పోజులు)
ముకేశ్, ఆర్కే, నీతూకి స్టడీ అండ్ బ్యాలెన్స్ అనే టాస్క్ పెడతారు. అందులో ముందుగా ముకేశ్ అవుట్ అవుతాడు. చివరకు నీతూ విన్నర్‌గా నిలుస్తుంది. తర్వాత కెప్టెన్సీ కంటెండర్లుగా దేబ్జానీ, అమన్, శివ్, నీతూ పోటీ పడతారు. తన టీంలోని వంశీని త్రిగుణ్ పక్కన పెట్టేస్తాడు. అలా ఆ నలుగురు నిలబెట్టు, పడగొట్టు అనే టాస్కులో పోటీ పడతారు. అందులో అమన్ చాలా వేగంగా టాస్క్‌ను ఫినిష్ చేస్తాడు. ఈ గేమ్‌లో గెలవడంతో అమన్ కెప్టెన్ అవ్వడమే కాకుండా.. 13వ వారంలో జరిగే టికెట్ టు ఫినాలే టాస్క్‌కు ఫస్ట్ కంటెండర్ అయ్యాడని బిగ్ బాస్ ప్రకటిస్తాడు. దీంతో ఇవాల్టి ఎపిసోడ్ ముగుస్తుంది.


