అనిరుధ్-కావ్య రిసెప్షన్.. చెన్నైలో సినీ, క్రికెట్ దిగ్గజాల సందడి | Anirudh Kavya Wedding Reception mahesh babu | Sakshi
Sakshi News home page

Anirudh-Kavya reception: అనిరుధ్-కావ్య రిసెప్షన్.. హాజరైన ప్రముఖులు

Nov 21 2026 2:48 PM | Updated on Nov 21 2026 3:10 PM

Anirudh Kavya Wedding Reception mahesh babu

సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ వివాహ రిసెప్షన్‌కు సినీ, క్రీడా, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు తరలివస్తున్నారు. నవంబర్ 11న గ్రీస్‌లో అత్యంత సన్నిహితుల సమక్షంలో వివాహ బంధంతో ఒక్కటైన ఈ జంట.. నేడు (నవంబర్ 21) చెన్నైలో ఘనంగా రిసెప్షన్ ఏర్పాటు చేసింది. ఈ వేడుకకు హాజరయ్యేందుకు పలువురు ప్రముఖులు చెన్నై చేరుకుంటున్నారు. దీంతో విమానాశ్రయంలో సందడి నెలకొంది.

సోషల్ మీడియాలో వైరల్‌గా
ఈ వేడుకకు హాజరయ్యేందుకు న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్స్‌, ఆ జట్టు మాజీ క్రికెటర్ డేనియల్ వెటోరీ, దక్షిణాఫ్రికా మాజీ ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్ తమ కుటుంబ సభ్యులతో కలిసి చెన్నైకి చేరుకున్నారు. అటు టాలీవుడ్ నుంచి సూపర్ స్టార్ మహేశ్ బాబు కూడా తన కుటుంబంతో కలిసి ఈ వేడుకకు హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలువురు ప్రముఖులు చెన్నై విమానాశ్రయానికి చేరుకున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

కాగా వీరిద్దరి వివాహం నవంబర్‌ 11న గ్రీస్‌లో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో వైభవంగా జరిగింది. ఈ వేడుకకు సూపర్‌స్టార్ రజనీకాంత్, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సహా కొంతమంది మాత్రమే హాజరయ్యారు. 

 (ఇదీ చదవండి: ఒక్క క్లిక్‌తో తాజా సినిమాల రివ్యూలు )

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement